హాథ్రస్ ఘటన నేపథ్యంలో.. మహిళల భద్రత విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. లైంగిక నేరాలపై పోలీసులు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది.
జీరో ఎఫ్ఐఆర్ తప్పనిసరి
నేరం ఏ ప్రాంతంలో జరిగినా.. ఇందుకు సంబంధించి దేశంలోని ఏ పోలీస్స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసే విధంగా కేంద్రం 'జీరో ఎఫ్ఐఆర్'ను రూపొందించింది. మహిళలపై లైంగికదాడికి పాల్పడితే అది కేసుపెట్ట దగిన నేరంగా పరిగణించాలి, కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది.
పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే..
లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీసులు, అధికారులు సహకరించాలి. ఈ కేసుల్లో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.