ETV Bharat / bharat

'ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి టీకా' - కొవిడ్​ వ్యాక్సిన్​ న్యూస్​

వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోపు దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ఆగస్టులోపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Centre has plan to vaccinate around 30 cr people for COVID-19 by July-August says Harsh Vardhan
'ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి టీకా'
author img

By

Published : Nov 30, 2020, 6:09 PM IST

వచ్చే ఏడాది ఆగస్టు కల్లా దేశంలో 30 కోట్ల మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు.

'వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోపు దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టులోపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు విధిగా పాటించాలి. ప్రపంచంలోనే భారత్‌లో అత్యధికంగా రికవరీ రేటు నమోదైంది. గత జనవరిలో మనవద్ద అందుబాటులో ఉన్న ప్రయోగశాలల సంఖ్య ఒకటి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 2వేలకు పైగా చేరింది. రోజూ మిలియన్ల మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు మనం 14 కోట్ల కరోనా వైరస్‌ పరీక్షలు పూర్తి చేశాం. దీన్ని బట్టి ప్రభుత్వం కరోనా వైరస్‌పై ఏ విధంగా విశ్రాంతి లేకుండా పోరాడుతుందో చెప్పవచ్చు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ మాస్కులు, పీపీఈ కిట్ల ఉత్పత్తి విషయంలో స్వావలంబన దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజూ 10లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. అంతేకాకుండా మన శాస్త్రవేత్తలూ సరైన సమయానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతర కృషి చేస్తున్నారు' అని హర్షవర్దన్‌ తెలిపారు.

దేశంలో ఇప్పటి వరకు 94లక్షల కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం 38వేల కేసులు నమోదవగా.. 443 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4లక్షలకు పైగా ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,37,139కి చేరింది.

ఇదీ చూడండి: ఆస్పత్రుల భద్రతపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.