ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్ల సమానత్వం కోసం జాతీయ మండలి

ట్రాన్స్​జెండర్ల అభ్యున్నతి కోసం కేంద్రం కీలక ముందడుగు వేసింది. ట్రాన్స్​జెండర్లకు సమాజంలో సమాన గౌరవం కల్పించే విధంగా జాతీయ మండలిని ఏర్పాటు చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.

author img

By

Published : Aug 22, 2020, 7:17 PM IST

Centre forms National Council for Transgender Persons
ట్రాన్స్​జెండర్ల కోసం జాతీయ మండలి ఏర్పాటు

ట్రాన్స్​జెండర్లకు సమాజంలో సమానత్వం కల్పించడం సహా ఆ దిశగా విధానాలు, చట్టాలు రూపకల్పన చేసేందుకు జాతీయ మండలిని ఏర్పాటు చేసింది కేంద్రం. ట్రాన్స్​జెండర్ల చట్టం 2019 ద్వారా ఈ మండలిని ఏర్పాటు చేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది.

ట్రాన్స్​జెండర్ల కోసం రూపొందించే విధివిధానాలు, చట్టాలు, ప్రాజెక్టులపై కేంద్రానికి సలహాలు ఇవ్వడంలో ఈ మండలి కీలకంగా వ్యవహరిస్తుంది. కేంద్రం తీసుకొచ్చే చట్టాల అమలు తీరును పర్యవేక్షిస్తుంది. దీంతోపాటు ఈ చట్టాలు వారిపై ఏమేరకు ప్రభావం చూపుతాయో అంచనా వేస్తుంది. ట్రాన్స్​జెండర్ల సమస్యలపై పనిచేస్తున్న ప్రభుత్వంలోని ఇతర శాఖలు, ప్రభుత్వేతర సంస్థల పనితీరును విశ్లేషిస్తుంది.

సభ్యులు వీరే..

ట్రాన్స్​జెండర్ల వర్గం నుంచి ఎంపికైనవారు ఈ మండలికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఐదు రాష్ట్రాలు, 10కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, ఈశాన్య భాగాలుగా పరిగణించి.. ఆయా ప్రాంతాల్లోని రాష్ట్రాల నుంచి ఒక్కో ప్రతినిధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఎన్నుకుంటారు. ట్రాన్స్​జెండర్ల వర్గాల్లోని ప్రతినిధులను సైతం ఇదే తరహాలో ఎంపిక చేస్తారు.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ఈ మండలికి ఛైర్​పర్సన్​గా వ్యవహరిస్తారు. అదే శాఖలోని జూనియర్ మంత్రి వైస్​ ఛైర్​పర్సన్​గా పనిచేస్తారు.

ఇదీ చదవండి: వీడియో వైరల్: గణనాథుడికి శునకం నమస్కారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.