ETV Bharat / bharat

రిజర్వేషన్ల అంశంపై 'దద్దరిల్లిన లోక్​సభ' - supreme latest verdicts

సుప్రీంకోర్టు 'రిజర్వేషన్ల తీర్పు'పై లోక్​సభ దద్దరిల్లింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భాజపా ప్రభుత్వం వ్యతిరేకమని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది. తాము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. సుప్రీం విచారణ జరిపిన పిటిషన్​ను దాఖలు చేసింది 2012లో ఉత్తరాఖండ్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేసింది.

centre-failed-to-defend-reservation-system-oppn-parties
రిజర్వేషన్ల అంశంపై 'దద్దరిల్లిన లోక్​సభ'
author img

By

Published : Feb 10, 2020, 6:27 PM IST

Updated : Feb 29, 2020, 9:37 PM IST

రిజర్వేషన్ల అంశంపై 'దద్దరిల్లిన లోక్​సభ'

ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లోక్​సభలో విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తాయి. భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లింది.

విపక్షాల ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్​ నేతలపై మండిపడింది.

సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని లోక్​సభలో స్పష్టం చేశారు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్​ చంద్ గహ్లోత్​. 2012లో ఉత్తరాఖండ్​లో​ కాంగ్రెస్​ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ అంశం తెరపైకి వచ్చిందని వివరణ ఇచ్చారు.

"ఈ విషయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం అఫిడవిట్​ను దాఖలు చేయలేదు. ఈ వివాదం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2012లో దాఖలు చేసిన పిటిషన్​ ద్వారా తెరపైకి వచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వద్దని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉంది. సుప్రీంతీర్పుపై మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం."

-థావర్​ చంద్ గహ్లోత్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి

గహ్లోత్ ప్రకటనపై సంతృప్తి చెందని కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్ చేసింది.

'9వ షెడ్యూల్​లో చేర్చాలి'

ఈ విషయంపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎన్డీఏ భాగస్వామి పార్టీ ఎల్​జేపీ నేత చిరాగ్​ పాసవాన్​ అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్​లో చేర్చితే ఎవరికీ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉండదని కేంద్రానికి సూచించారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి..

రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ అన్నారు. కేంద్రం రిజర్వేషన్లకు వ్యతిరేకమని నమ్మేందుకు కారణాలున్నాయని డీఎంకే నేత ఏ రాజా ఆరోపించారు. సుప్రీంతీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఎస్​పీ ఆరోపించింది. సుప్రీం తీర్పు దురదృష్టకరమని అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్​ అన్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని సూచించారు.

ఈ విషయంపై మాటలు కాదు చేతలు అవసరమని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

New Delhi, Feb 10 (ANI): Speaking on Gargi college alleged sexual assault case, South Delhi DCP Atul Thakur informed that inspector of CAW Cell and Additional DCP South Delhi has been appointed to conduct an inquiry into the case. "An inspector of Crime Against Women (CAW) Cell has been designated as investigation officer in the case. The Additional DCP (South) has been designated as inquiry officer to conduct an inquiry into all aspects related to the case," said DCP South Delhi. Earlier, Gargi College students were allegedly assaulted sexually on campus during cultural fest. The fest took place form February 04 to 06. National Commission for Women took cognizance of alleged sexual crime.
Last Updated : Feb 29, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.