ETV Bharat / bharat

ఇకపై రైల్వే ఆసుపత్రుల్లోనూ వారికి చికిత్స

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఓ వెసులుబాటు కల్పించింది కేంద్రం. అన్ని రైల్వే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందొచ్చని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

CENTRAL GOVERNMENT NOTIFIES ITS EMPLOYEES TO USE RAILWAY HOSPITALS
ఇకపై రైల్వే ఆసుపత్రుల్లోనూ వారికి చికిత్స
author img

By

Published : Mar 29, 2020, 6:40 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే ఆస్పత్రుల్లో వైద్య సేవలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉన్న 128 రైల్వే ఆసుపత్రులు, 586 డిస్పెన్సరీల్లో వైద్య సేవలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

గుర్తింపు కార్డులను చూపించి వాటిలో వైద్య సేవలను పొందవచ్చని బోర్డు తెలిపింది. రైల్వే ఆస్పత్రుల్లో ప్రస్తుతం వైద్య సేవలు రైల్వే ఉద్యోగులు, విశ్రాంత రైల్వే ఉద్యోగులకు మాత్రమే లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:- కరోనాపై పోరుకు రంగంలోకి దిగిన ఇస్రో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.