ETV Bharat / bharat

'దేశంలో మొత్తం 170 హాట్​స్పాట్​ ప్రాంతాలు గుర్తింపు'

దేశంలోని జిల్లాలను మూడు జోన్లుగా విభజించినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా కేసుల ప్రాతిపదికన జిల్లాలను హాట్​స్పాట్​, హాట్​స్పాట్​ యేతర, గ్రీన్​జోన్​ అనే మూడు విభాగాలుగా విభజించింది. దేశవ్యాప్తంగా వైరస్​ కేసుల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

Center Classifieds districts into three categories
'దేశంలో మొత్తం 170 హాట్​స్పాట్​ ప్రాంతాలు గుర్తింపు'
author img

By

Published : Apr 15, 2020, 5:44 PM IST

Updated : Apr 15, 2020, 6:13 PM IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జిల్లాలను కరోనా కేసుల ప్రాతిపదికన.. హాట్​స్పాట్​, హాట్​స్పాట్​ యేతర, గ్రీన్​జోన్​ అనే మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హెల్త్​ సెక్రటరీలు, డీజీపీలతో కేబినెట్​ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించినట్లు తెలిపిన ఆయన.. కొవిడ్​-19 హాట్​స్పాట్​ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వివరించారు.

" దేశవ్యాప్తంగా మొత్తం 170 హాట్​స్పాట్లు, 207 హాట్​స్పాట్​ యేతర ప్రాంతాలను గుర్తించాం. హాట్​స్పాట్​ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాం. నిర్బంధ జోన్లలో అత్యవసరమైన వారికి మినహా ఎలాంటి రాకపోకలకు అనుమతి ఉండదు. కొత్త కరోనా కేసుల కోసం ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుంది. శాంపిల్స్​ సేకరించి నమూనా ప్రమాణాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తుంది. భారత్​లో ప్రస్తుతం కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్​ లేదు."

- లవ్​ అగర్వాల్​, కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి

దేశంలో 11,439కి చేరిన కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,076 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 11,439కు చేరాయి. ప్రస్తుతం 1,306 మంది కోలుకోగా.. 9756 యాక్టివ్​ కేసులున్నాయి. 377 మంది మరణించారు.

Last Updated : Apr 15, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.