పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోంది పాక్. భారత సైనిక స్థావరాలతో పాటు, సాధారణ పౌరుల నివాసాలపై కాల్పులకు తెగబడుతోంది. బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలపై ఆదివారం భారీగా కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం.
యూరి కమల్ కోట్లోని భారత పోస్టులు, గ్రామాలే లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు సహా ఓ మహిళ గాయపడినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
పాక్ సైన్యం కాల్పులకు దీటుగా సమాధానం చెప్పింది భారత సైన్యం.