ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 'పది' ఫలితాలు బుధవారమే

పదో తరగతి పరీక్ష ఫలితాలు జులై 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సీబీఎస్​ఈ. కరోనా కారణంగా రద్దైన పరీక్షల్లో.. అంతర్గత మదింపు పద్ధతిని అనుసరించి మార్కులు వేయనున్నట్లు స్పష్టం చేసింది.

CBSE to announce class 10 results on July 15
జులై 15న సీసీఎస్​సీ పదో తరగతి ఫలితాల వెల్లడి!
author img

By

Published : Jul 14, 2020, 2:37 PM IST

దిల్లీలోని సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ) దేశవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల విడుదల తేదీ ప్రకటించింది. జులై 15న ఫలితాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ 'నిషాంక్​' ట్విట్టర్​లో ఓ పోస్ట్​ చేశారు.​

"ప్రియమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు... సీబీఎస్​ఈ ఫలితాల విడుదల రేపే. పదో తరగతి విద్యార్థులందరికీ బెస్ట్​ ఆఫ్​ లక్​"

-రమేశ్​ పోఖ్రియాల్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్​ఈ బోర్డు.. విద్యార్థులు పూర్వ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించనుంది.

కరోనా సంక్షోభం కారణంగా మిగిలిన పరీక్షలను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత సీబీఎస్‌ఈ బోర్డు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటంటే..

  • అన్ని పరీక్షలు రాసిన 10, 12 తరగతి విద్యార్థుల ఫలితాలను యథావిధిగా ప్రకటిస్తారు.
  • మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసిన విద్యార్థులకు మాత్రం.. అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా ప్రతిభను మదింపు చేస్తారు.
  • 3 సబ్జెక్టులకు మాత్రమే హాజరైన విద్యార్థులకు.. 2 సబ్జెక్టులలో సాధించిన అత్యుత్తమ మార్కుల సగటు, అంతర్గత, ప్రాక్టికల్‌ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తుది మార్కులు కేటాయిస్తారు.
  • 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు ఇంకో అవకాశాన్ని ఇచ్చింది. మదింపు ఆధారంగా వచ్చిన మార్కులపై అసంతృప్తిగా ఉంటే.. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించనుంది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసే అవకాశం లేదని బోర్డు ఇదివరకే స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: సీబీఎస్​ఈ ఫైనల్​ మార్కులు లెక్కిస్తారిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.