ETV Bharat / bharat

సుశాంత్ కేసు పని పట్టే సీబీఐ బృందం ఇదే! - CBI to investigate Sushant's death case

విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్​లాండ్ వంటి కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందమే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్​పుత్ కేసును విచారిస్తోంది. సీబీఐ అవినీతి నిరోధక విభాగం-4కి చెందిన సిట్ ఈ మేరకు ఆరుగురిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది.

CBI's SIT probing Vijay Mallya, AgustaWestland cases to investigate Sushant's death case
మాల్యా​ కేసును విచారిస్తున్న సిట్​కే సుశాంత్ కేసు
author img

By

Published : Aug 7, 2020, 7:21 AM IST

విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్​లాండ్​ వంటి కీలక కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజాగా సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ కేసుపై విచారణ చేపట్టింది. యువనటుడి మృతికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురిపై ఇప్పటికే ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది.

సీబీఐ అవినీతి నిరోధక విభాగం-4కి చెందిన సిట్ ఈ మేరకు కేసు నమోదు చేసింది. ఆరుగురు నిందితులతో పాటు మరికొందరిపై నేరపూరిత కుట్ర, హత్యకు పాల్పడటం, తప్పుగా నిర్బంధించడం, దొంగతనం, నమ్మక ద్రోహం, మోసం, బెదిరింపులకు పాల్పడటం వంటి అభియోగాలు మోపింది. విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్​లాండ్​లతో పాటు మరికొన్ని హై ప్రొఫైల్ కేసులను ఈ విభాగమే దర్యాప్తు చేస్తోంది.

ఆరుగురు నిందితులను త్వరలో సీబీఐ విచారణకు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు ముంబయి పోలీసులు పిలిచి విచారించిన వ్యక్తులను సైతం సీబీఐ ప్రశ్నించనున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.