ETV Bharat / bharat

'బాబ్రీ' తీర్పుపై న్యాయ విభాగాన్ని సంప్రదిస్తాం: సీబీఐ - ఎల్‌కే అడ్వాణీ

బాబ్రీ కేసు తీర్పుపై అప్పీల్​ చేసే అంశంపై న్యాయ విభాగాన్ని సంప్రదించనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). బాబ్రీ కేసులో బుధవారం తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలను కొట్టివేసింది.

CBI to decide on challenging special court verdict after consulting legal department: Counsel
'బాబ్రీ' తీర్పుపై న్యాయ విభాగాన్ని సంప్రదిస్తాం.. తర్వాతే!
author img

By

Published : Sep 30, 2020, 4:14 PM IST

బాబ్రీ కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును.. సవాల్​ చేయాలని భావిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ అంశంలో న్యాయ విభాగాన్ని సంప్రదించిన అనంతరం.. నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది సీబీఐ.

''తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీ వచ్చిన తర్వాత.. దానిని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తాం. న్యాయ విభాగం ఆ తీర్పును పూర్తిగా అధ్యయనం చేస్తుంది. వారి సలహాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటాం.''

- లలిత్​ సింగ్, సీబీఐ న్యాయ సలహాదారు

బాబ్రీ మసీదు కేసు తీర్పుపై అప్పీల్​ చేస్తారా? అన్న ప్రశ్నకు ఇలా బదులిచ్చారు లలిత్​ సింగ్​.

ఆధారాల్లేవ్​..

మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితోపాటు మరికొంతమందిని నిర్దోషులుగా పేర్కొంటూ బుధవారం తీర్పు చెప్పింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది.

ఇవీ చూడండి:

బాబ్రీ తీర్పుపై అడ్వాణీ, జోషి హర్షం

'బాబ్రీ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.