సంచలన హాథ్రస్ కేసు ఎఫ్ఐఆర్ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఉందని గ్రహించిన అధికారులు.. గంటల వ్యవధిలోనే దానిని తొలగించారు. ఎఫ్ఐఆర్లో బాధితురాలు పేరును కనిపించకుండా వైట్నర్తో కొట్టి వేసినప్పటికీ అనవసర వివాదాలకు దారీతీయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అత్యాచార, లైంగిక దాడులకు గురైన బాధితులు మైనర్లు అయితే.. వారిని గుర్తిస్తూ ఎటువంటి వివరాలను బహిర్గతం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సుప్రీం కోర్టు 2018లో ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: 'హాథ్రస్ కేసులో అనైతికంగా యోగి సర్కార్ తీరు'