బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చక్కెర కర్మాగారాల అమ్మకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2011లో 21 కర్మాగారాలను మార్కెట్ ధర కన్నా తక్కువ రేట్లకు అమ్మడంతో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 1179 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.
లఖ్‌నవూ పోలీసులు విచారణ చేస్తున్న ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 12న సిఫారసు చేసింది.
ఏ అధికారి, రాజకీయనేత పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు సీబీఐ. ప్రభుత్వ కర్మాగారాలను స్వాధీనం చేసుకునేందుకు తప్పుడు పత్రాలను సమర్పించిన ఏడుగురు ప్రైవేటు సంస్థ వ్యక్తులపై కేసు నమోదు చేసింది.
అప్పటి మాయావతి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్న 10, మూత పడిన 7 మిల్లుల్ని మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందన్న అభియోగాలపై సీబీఐ విచారించనుంది.
ఇదీ చూడండి: సీజేఐపై ఆరోపణల కేసులో అంతర్గత విచారణ