ప్రభుత్వ ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతకలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తుకిపై కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. 2003లో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నబం తుకి ఉన్న సమయంలో ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతి జరిగినట్లు పేర్కొంది. రూ.3.20 కోట్ల విలువైన ప్రాజెక్టును టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ్ముడికి కట్టబెట్టినట్లు ఆరోపించింది.
తుకి తమ్ముడు నబం తగమ్, యునైటెడ్ కమెర్షియల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సొహ్రాబ్ అలి హజారికాలపైనా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
2011-16 మధ్య కాలంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు నబం తుకి.
ఇదీ చూడండి: చెట్టెక్కి ఇరుక్కున్నాడు.. వల వేసి కాపాడారు