ETV Bharat / bharat

'భారతీయుడు -2' ప్రమాదంపై శంకర్​ను ప్రశ్నించిన సీబీసీఐడీ

భారతీయుడు -2 చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై సీబీసీఐడీ విచారణకు దర్శకుడు శంకర్ హాజరయ్యారు. ప్రమాదానికి సంబంధించి మూడు గంటల పాటు శంకర్​ను అధికారులు ప్రశ్నించారు.

CBCID questions director Shankar on 'Bharatiyudu-2' accident
దర్శకుడు శంకర్​
author img

By

Published : Feb 27, 2020, 7:51 PM IST

Updated : Mar 2, 2020, 7:04 PM IST

శంకర్ దర్శకత్వంలో కమల్​హాసన్​ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారతీయుడు -2 చిత్రీకరణ సమయంలో భారీ క్రేన్ విరిగిపడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు సినిమా సెట్ మేనేజర్, క్రేన్ యజమాని, ఆపరేటర్లు సహా మొత్తం ఆరుగురిని విచారించిన అధికారులు.. చిత్ర దర్శకుడు శంకర్​ను గురువారం మూడు గంటలపాటు ప్రశ్నించారు. త్వరలో హీరో కమల్​హాసన్​ను సైతం సీబీసీఐడీ విచారించనున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​, క్రేన్ ఆపరేటర్లపై కేసులు నమోదయ్యాయి. సినీ కార్మికుల భద్రతపై పలువురు ప్రశ్నలు లేవనెత్తడం వల్ల ఈ కేసు సీబీసీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చూడండి: అమెరికా మతస్వేచ్ఛ కమిషన్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం

Last Updated : Mar 2, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.