గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, భాజపా నేత అల్పేశ్ ఠాకూర్‌పై బిహార్‌లో కేసు నమోదైంది. ఏడాది కిందటి ఘటన ఆధారంగా కాంటీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
గుజరాత్లో నివసిస్తున్న బిహార్ వాసులపై వివక్ష చూపడాన్ని ఆధారంగా చేసుకుని విజయ్ రూపానీ, భాజపా నేత అల్పేశ్ ఠాకూర్లపై ఫిర్యాదు చేశారు సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 153, 295,504 కింద కేసు నమోదు చేశారు కాంటీ పోలీసులు.