దిల్లీలో 'మై బీ చౌకీదార్' పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. దేశాభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్కరూ చౌకీదార్లేని ఉద్ఘాటించారు. మహాత్మగాంధీ ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు మోదీ. నలభై ఏళ్లుగా ఉగ్రవాదంతో బాధపడుతున్నామన్నారు. దీనికి కారణమెవరో ప్రజలందరికీ తెలుసన్నారు.
రాజులు కాదు కావలసింది...
భారత్కు కావలసింది రాజులు, మహారాజులు కాదని ప్రతిపక్షాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోదీ. చౌకీదార్ అనే అంశం ప్రజల్లోకి వెళ్తుండటం తనకు సంతోషం కలిగిస్తుందన్నారు. ప్రజలకు చౌకీదార్పై పూర్తి విశ్వాసం ఉందనిపేర్కొన్నారు.
బాలాకోట్ వైమానిక దాడులు మన జవాన్లు చేశారని, తాను చేయలేదన్నారు ప్రధాని. వైమానిక దాడులు చేసిన వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు.