ETV Bharat / bharat

'విద్వేష రాజకీయాలకు వర్శిటీలు కేరాఫ్​ కాకూడదు'

జేఎన్​యూలో విద్యార్థులపై దాడి నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్శిటీలు విద్వేష రాజకీయాలకు ప్రధాన కేంద్రం​ కాకూడదన్నారు. విశ్వవిద్యాలయాల్లో చదువుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు.

Campuses must not become safe havens for politics of hate: V-P
'విద్వేష రాజకీయాలకు వర్శిటీలు కేరాఫ్​ కాకూడదు'
author img

By

Published : Jan 7, 2020, 5:55 PM IST

విద్వేష, హింసా రాజకీయాలకు విద్యా సంస్థలు స్వర్గధామాలు కాకూడదని అభిప్రాయపడ్డారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. విశ్వవిద్యాలయాల్లో చదువుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి కానీ వర్గ పోరు, విభజన ధోరణులకు కాదని హితవు పలికారు. దిల్లీ జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ)లో ఆదివారం హింస చెలరేగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.

నేషనల్​ అస్సెస్​మెంట్​ అండ్​ అక్రిడిటేషన్​ కౌన్సిల్​(ఎన్​ఏఏసీ) రజతోత్సవం సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకయ్య.

"మన పిల్లలు విద్యా సంస్థల నుంచి వారి చదువును పూర్తి చేసుకొని బయటకు వచ్చే సమయానికి మంచి పౌరులుగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వారిలా కనిపించాలి. ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా రూపొందాలి."

-వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి

భారత్​లో పరిశోధనా రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. పరిశోధన-అభివృద్ధి(ఆర్​ అండ్​ డీ) కోసం ప్రస్తుతం దేశ జీడీపీలో కనీసం ఒక్క శాతమైనా ఖర్చు పెట్టకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి : 'మరింత దృఢంగా భారత్​-అమెరికా స్నేహబంధం'

New Delhi, Jan 07 (ANI): Equity benchmark indices rebounded during early hours on Tuesday in line with Asian markets with no new escalation in the Middle East. At 10:15 am, the BSE SandP Sensex gained by 467 points to 41,143 while the Nifty 50 edged higher by 131 points at 12,124. Ebb in global crude oil prices and rupee's rise against the US dollar also influenced the market mood. All sectoral indices were in the positive zone except for Nifty IT which slipped slightly by 0.11 per cent.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.