కర్ణాటక అధికార కూటమిపై వాగ్బాణాలు సంధించారు కేంద్ర రసాయన, ఎరువుల శాఖమంత్రి డీవీ సదానంద గౌడ. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి చేయనున్న మంత్రివర్గ విస్తరణ ప్రయత్నాలు ఫలించవన్నారు. మంత్రివర్గ విస్తరణే అధికార కూటమి పడిపోవడానికి పునాది వేయనుందని జోస్యం చెప్పారు.
"ప్రభుత్వం పడిపోయేందుకు మంత్రివర్గ విస్తరణే పునాది రాయి. అధికార కూటమిలోని అసంతృప్తులు అందరికీ తెలుసు. వారి అంతర్గత వ్యవహారంలో నేను జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న సాహసమే వారికి చివరి విన్యాసం. ఈ సారి అదే వారి కొంప ముంచుతుంది."
-డీవీ సదానంద గౌడ, కేంద్ర మంత్రి
నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి జూన్ 12న గవర్నర్ వాజూభాయ్ వాలా సమయమిచ్చారని ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.
కర్ణాటక మంత్రివర్గంలో మరో ముగ్గురు మంత్రులుగా నియామకమయ్యేందుకు అవకాశం ఉంది. స్వతంత్ర ఎంఎల్ఏ నగేశ్, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ ఎంఎల్ఏ ఆర్.శంకర్, జేడీఎస్ ఎంఎల్సీ బీఎమ్ ఫరూఖ్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని సమాచారం.
ఇదీ చూడండి: బెంగాల్ హింసాకాండపై కేంద్రం ఆందోళన