దేశ సరిహద్దుల్లోని వారికి సైతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించింది.
"ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే అంతర్జాతీయ సరిహద్దుల్లోని వారికి సైతం రిజర్వేషన్లు అమలువుతాయి. విద్యా, ఉద్యోగాల్లో జమ్ము కశ్మీర్లో ఇప్పటి వరకు అందుతున్న రిజర్వేషన్లతో పాటు మరో 10 శాతం ఆర్థికంగా వెనకబడిన వారికి అందనున్నాయి."
- అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి
రూ.8 వేల కోట్లతో ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టు, రెండు కారిడార్లతో కాన్పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని తెలిపారు జైట్లీ. బ్రహ్మపుత్ర నదిపై 4 వరుసల వంతెన, హరియాణా మనేథీలో ఎయిమ్స్ నిర్మాణం, గుజరాత్‌లోని రాజ్‌కోట్, హిరసార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.