ETV Bharat / bharat

ఆ పథకానికి కేంద్రం ఆమోదం- లక్షలాది మందికి లబ్ధి - cabinet latest news

కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆత్మనిర్భర్​ భారత్​ రోజ్​గార్​ యోజనకు ఆమోదం తెలిపింది. దీనితో సుమారు 58.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరునున్నట్లు స్పష్టం చేసింది. వైఫై సేవలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు పీఎం వాని పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది.

cabinet-approves-atmanirbhar-bharat-rozgar-yojana
ఆ పథకానికి కేంద్రం ఆమోదం- లక్షలాది మందికి లబ్ధి
author img

By

Published : Dec 9, 2020, 3:58 PM IST

Updated : Dec 9, 2020, 4:23 PM IST

ఆత్మనిర్భర్ భారత్​​ రోజ్​గార్​ యోజనకు కేంద్ర మంత్రివర్గం​ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు కేటాయించింది. మొత్తం పథకానికి రూ. 22 వేల 810 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో 58.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్​ గంగ్వార్​ వెల్లడించారు.

కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కొత్త నియామకాలు చేపడితే.. రెండేళ్ల వరకు ఉద్యోగి, యజమాని వాటా కింద పదవీ విరమణ నిధికి జమ చేయాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే అందిస్తుంది.

ఆత్మనిర్భర్​ భారత్​ రోజ్​గార్​ యోజన అంటే..?

  • ఈపీఎఫ్​ఐ పరిధిలోని సంస్థ కొత్త ఉద్యోగిని(గతంలో పీఎఫ్​లో చేరనివారు లేదా ఉద్యోగం కోల్పోయిన వారు) చేర్చుకుంటే.. సంస్థకు, ఉద్యోగికి పీఎఫ్ కంట్రిబ్యూషన్​లో రాయితీ​.
  • రెండేళ్ల పాటు సంస్థ-ఉద్యోగుల కంట్రిబ్యూషన్లు (24శాతం) ఆయా సంస్థలకు అందజేత.
  • ఈపీఎఫ్​ఓలో నమోదు చేసుకున్న సంస్థల్లో రూ. 15వేలు కన్నా తక్కువ జీతానికి చేరిన కొత్త ఉద్యోగికి వర్తింపు.
  • కరోనా వల్ల 2020 మార్చి 1 అనంతరం ఉద్యోగం కోల్పోయి.. 2020 అక్టోబర్​ 1 తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన వారు(రూ. 10వేల కన్నా తక్కువ జీతం) కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.
  • నిబంధన:- కనీసం 2 కొత్త ఉద్యోగాలు(50 కన్నా తక్కువ సిబ్బంది ఉన్న సంస్థలు), కనీసం 5 కొత్త ఉద్యోగాలు(సిబ్బంది 50కు పైబడిన సంస్థలు).
  • 2021 జూన్​ 30 వరకు ఈ పథకం అమలు.

ఇదీ చూడండి: 'మధ్యతరగతి'కి కేంద్రం 'ఆత్మనిర్భర్​' కానుక

వైఫై విస్తరణ..

దేశంలో మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన వైఫై సేవలను అందించేందుకు పీఎం వైఫై యాక్సెస్​ నెట్​వర్క్ ఇంటర్​ఫేస్​(పీఎం వాని) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ​వైఫై నెట్​వర్క్​ను పెద్దఎత్తున విస్తరించాలని నిర్ణయించింది. వైఫై కోసం ఎలాంటి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు ఉండబోవని స్పష్టం చేసింది. విస్తరణలో భాగంగా కోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు.

లక్షద్వీప్​నకు వేగవంతమైన అంతర్జాల బ్రాడ్​బ్యాండ్​ సేవలను అందించేందుకు సముద్ర గర్భ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ను ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.

Last Updated : Dec 9, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.