ETV Bharat / bharat

మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు- ఐదుగురు మృతి - లోయలో పడ్డ బస్సు

మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు- నలుగురు మృతి

author img

By

Published : Oct 21, 2020, 8:15 AM IST

Updated : Oct 21, 2020, 10:05 AM IST

10:01 October 21

పెరిగిన మృతులు

accident
లోయలో పడ్డ బస్సు

మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. మరో 34మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

జల్​గావ్​​ నుంచి గుజరాత్​లోని సూరత్​కు వెళుతున్న ఓ బస్సు కొండైబరీ ఘాట్​ వద్ద 40 అడుగుల లోయలో పడింది. ప్రాంతంలోని ఓ మలుపు వద్ద బస్సుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

08:10 October 21

లోయలో పడ్డ బస్సు

accident
క్షతగాత్రులు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్​లోని సూరత్​కు వెళుతున్న ఓ బస్సు కొండైబరీ ఘాట్​ వద్ద లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 35మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు సమాచారం.

జల్​గావ్​​ నుంచి సూరత్​ వెళుతున్న బస్సు.. అర్ధరాత్రి ప్రాంతంలో దార్​గాహ్​ సమీపంలోని 40 అడుగుల లోయలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Last Updated : Oct 21, 2020, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.