ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. గొలంత్ర పరిధి మంద్రాజ్పుర్ మార్గంలో.. 11కేవీ హై ఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ఓ బస్సుకు మంటలంటుకున్నాయి. ఈ విద్యుదాఘాతంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గాయపడ్డారు. మంటలు అదుపు చేసిన అనంతరం స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
నిశ్చితార్థం వేడుకకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.