మహారాష్ట్ర రాయ్గడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి కంకవాలికి 31 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు కషేడీ ఘాట్ వద్ద 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 15 మందికి గాయాలయ్యాయి.
తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను పోలాద్పుర్ ఆస్పత్రికి తరలించారు.