ETV Bharat / bharat

మద్యం మత్తులో యువకుడి పాశవిక చర్య.. ఎద్దు బలి - tamilanadu news

మద్యం మత్తులో ఉన్న యువకుడి పాశవిక చర్యకు ఓ ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. జల్లికట్టు పోటీల్లో పాల్గొనే వృషభం.. చెట్టుకు కట్టేసి ఉండగా రెచ్చగొడుతూ తీవ్రంగా గాయపడేలా చేసిన దృశ్యాలు వైరల్​గా మారాయి. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Bull Tortured to Death
మద్యంమత్తులో యువకుడి పాశవిక చర్య
author img

By

Published : Jun 12, 2020, 10:38 AM IST

దేశంలో మూగజీవాలపై దాడులు పెరిగిపోతున్నాయి. జంతువులపై కొందరు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కేరళలో ఏనుగు మృతి, శునకం ముఖానికి టేపు చుట్టిన ఘటనలు మరవకముందే తమిళనాడులో ఓ యువకుడి పాశవిక చర్యకు ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. చెట్టుకు కట్టేసి ఉన్న వృషభాన్ని మద్యం మత్తులో రెచ్చగొట్టి తీవ్రంగా గాయపడేలా చేసి దాని మరణానికి కారణమయ్యాడు.

తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని పప్పారపట్టి గ్రామ పాలనాధికారికి చెందిన జల్లికట్టు ఎద్దు తీవ్ర గాయాలతో మృతి చెందింది. దానికి సంబంధించిన వీడియోలు బయటకి రావటం వల్ల వృషభం మృతికి ఓ కుర్రాడి వికృత చేష్టలే కారణమని తెలిసింది.

మద్యంమత్తులో యువకుడి పాశవిక చర్య.. ఎద్దు బలి

అపస్మారక స్థితిలోకి వెళ్లి..

మద్యం మత్తులో ఉన్న యువకుడు చెట్టుకు కట్టేసి ఉన్న ఎద్దును రెచ్చగొడుతూ పాశవిక ఆనందం పొందేందుకు ప్రయత్నించాడు. అతని చేష్టలతో కోపంతో ఊగిపోయిన ఆ వృషభం పలుమార్లు చెట్టుని ఢీకొట్టింది. దాని కొమ్ములు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. నోట్లో నుంచి వస్తున్న రక్తాన్ని చూసి కూడా అతని మనసు చలించలేదు. అలాగే రెచ్చగొడుతూనే ఉన్నాడు. చివరికి ఎద్దు కళ్లు తిరిగి కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను ఆ యువకుడి స్నేహితుడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వృషభం అకాల మరణం చెందటం వల్ల గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. వీడియో ఆధారంగా ఎద్దు మృతికి కారణమైన యువకుడు లోకేశ్​గా గుర్తించారు పోలీసులు. అతని కోసం గాలింపు చేపట్టారు.

Bull Tortured to Death
ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహిస్తోన్న గ్రామస్థులు

ఇదీ చూడండి: మూగజీవికి నరకయాతన.. ఈ సారి శునకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.