ETV Bharat / bharat

బడ్జెట్ 2019​: నవ భారతం X అంకెల గారడీ

బడ్జెట్ భవిష్యత్​ దర్శిని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలు బడ్జెట్​లో ప్రతిబింబించాయని అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమానికి, పేదలకు గౌరవమైన జీవితం, మధ్యతరగతి వారికి సాధికారత దిశగా బడ్జెట్ అవకాశం కల్పిస్తోందన్నారు. బడ్జెట్​పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా నింపిందని ఆరోపించింది.

మోదీ మార్క్​ బడ్జెటన్న భాజపా, విపక్షాల విమర్శలు
author img

By

Published : Jul 5, 2019, 6:33 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్​పై ఎన్డీఏ వర్గాలు ప్రశంసలు కురిపించాయి. కాంగ్రెస్ సహా వివిధ విపక్ష పార్టీలు బడ్జెట్​లో పస లేదని విమర్శలు చేశాయి.

బడ్జెట్​పై ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. నవ భారత నిర్మాణం దిశగా బడ్జెట్​లో కేటాయింపులు చేశారని పేర్కొన్నారు షా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాలను బడ్జెట్ ప్రతిబింబించిందన్నారు షా. రైతు సంక్షేమం, పేదలకు గౌరవమైన జీవితం, మధ్యతరగతి వారికి సాధికారత అందించే బడ్జెటని ఉద్ఘాటించారు. ఆర్థిక రంగం, గృహ, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత ఐదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

సుస్థిరాభివృద్ధి దిశగా...

"విద్యుత్​తో నడిచే వాహనాలు, రవాణా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా బడ్జెట్ ఉంది. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టి, సుస్థిరాభివృద్ధి నెలకొనేందుకు అవసరమైన కేటాయింపులు చేశారు."

-నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖమంత్రి

'నవ భారత నిర్మాణానికి గెజిట్'

"నవ భారత నిర్మాణానికి తాజా బడ్జెట్ గెజిట్ వంటిది. సంఘటిత వృద్ధి, సుస్థిర పాలనపై అంకిత భావంతో ప్రకటించిన బడ్జెట్ ఇది."

-ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి

మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన దిశగా...

"ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. ఈ బడ్జెట్ భారతదేశ అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుంది. మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనకు ఎంతో దోహదపడుతుంది."

-సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీ మంత్రి

కొత్త సీసాలో పాత సారా...

కేంద్రం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా ఉందన్నారు కాంగ్రెస్ లోక్​సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి. నవ భారతం గురించి అధికార పక్ష నేతలు మాట్లాడుతున్నారు కానీ.. ఇదంతా అంకెల గారడీలా ఉందన్నారు.

"ఉద్యోగ కల్పనలో సరైన ప్రణాళిక ప్రభుత్వం వద్ద లేదు. వ్యవసాయ రంగానికి, కార్మికులకు అందించాల్సిన మౌలిక సదుపాయాలపై బడ్జెట్​లో ప్రభుత్వం సరైన మార్గం చూపలేదు. పాత కేటాయింపులనే మరోసారి చేసినట్టు ఉంది."

-అధిర్ రంజన్ చౌదరి

'అంకెల గారడీతో నవ భారతాన్ని నిర్మించలేం'

నవ భారత నిర్మాణాన్ని అంకెలతో చేసిన గారడీ ముందుకు తీసుకెళ్తుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. 2019 బడ్జెట్​ నిరాశ పరిచేదిగా ఉందన్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వం సరైన విధంగా వివరించలేదన్నారు. ఆర్థిక వృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో సున్నాకు చేరుకున్నామని ఆరోపించారు.

ఓ వర్గంతోనే మోదీ మనసు

ప్రభుత్వ రంగ సంస్థలకు చేయూత, వారసత్వ పన్ను వంటి వాటితో మోదీ తాను వామపక్ష వాదినని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ. ఓట్ల కోసమే ఈ రకమైన కేటాయింపులు చేశారని విమర్శించారు. వామపక్ష భావజాలం ఉన్నవారు, రైట్ వింగ్ పార్టీలు తనకే ఓటు వేయాలని మోదీ కోరుకుంటారని, కానీ ఆయన మనసెప్పుడూ ఒక వర్గం వైపే మొగ్గు చూపుతుందని అన్నారు సింఘ్వీ.

ఇదీ చూడండి: 'బడ్జెట్​ లక్ష్యాల సాధనే అసలు సవాలు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.