ఆర్థిక బిల్లు-2019కు లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదముద్ర లభించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం తర్వాత లోక్‌సభ ఆమోదించింది. పౌర జీవనం మరింత సులభతరం అయ్యేలా బిల్లును రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు.
"'కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన' మా విధానమని సభికులకు పునరుద్ఘాటిస్తున్నా. దేశ ప్రజల జీవనాన్ని సులభతరం చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పౌరుడి బాధను తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకు తగినట్లు ఆర్థిక బిల్లులో పన్ను ప్రతిపాదనలు చేశాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రతిపాదనలే బడ్జెట్‌లో ఉన్నాయని సీతారామన్ వెల్లడించారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.
ఇదీ చూడండి: జాదవ్ విడుదలకు నిర్విరామ కృషి: భారత్