ETV Bharat / bharat

భారత గగనతలంలోకి పాక్​ డ్రోన్​.. కూల్చిన భద్రతా దళాలు - పాక్ డ్రోన్​ను కూల్చిన బీఎస్ఎఫ్ జవాన్లు

భారత్​లోకి చొచ్చుకొచ్చిన ఓ పాక్​ డ్రోన్​ను కూల్చేసింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). కథువా జిల్లా పన్సార్ ఔట్ పోస్ట్ వద్ద.. పాక్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్​ను పరిశీలించిన సైన్యం దానిపై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపి నేలకూల్చింది. అనంతరం అందులో అక్రమంగా ఆయుధాలు చేరవేస్తున్నారని గుర్తించింది.

drone
పాక్ డ్రోన్​ను కూల్చిన బీఎస్ఎఫ్ జవాన్లు
author img

By

Published : Jun 20, 2020, 10:08 AM IST

Updated : Jun 20, 2020, 12:12 PM IST

భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట దాయాదికి చెందిన ఓ డ్రోన్​ను కూల్చేసింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్). కథువా జిల్లా పన్సార్​ ఔట్​ పోస్ట్ పైనుంచి ఎగురుతూ వెళ్తున్న పాక్ డ్రోన్​ను గమనించిన సిబ్బంది ఉదయం 5.10 గంటలకు నేలకూల్చారు.

drone
కుప్పకూలిన పాక్ డ్రోన్

డ్రోన్​ను పరిశీలించిన అనంతరం ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఓ అధునాతన తుపాకీ, 60 రౌండ్ల తూటాలు, 7 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. పన్సార్​ వద్ద సరిహద్దుకు అవతలి వైపు నుంచి భారత్​లో ఉన్న పాక్ ఏజెంట్లకు అందించేందుకే డ్రోన్ ద్వారా ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు భావిస్తున్నామని వెల్లడించారు బీఎస్​ఎఫ్ అధికారులు.

drone
డ్రోన్​ను పరిశీలిస్తున్న బీఎస్​ఎఫ్ జవాన్లు

ఈ అనుమానాస్పద పాక్​ డ్రోన్ 250 మీటర్ల మేర భారత్​లోకి చొచ్చుకొచ్చిందని.. తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం నేలకూలిందని చెప్పింది సైన్యం. ఘటనా స్థలానికి వెళ్లిన సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

gun
డ్రోన్​లో బయటపడిన తుపాకి
gun
డ్రోన్​లో బయటపడిన తుపాకి

భారత్ లక్ష్యంగా కాల్పులు..

ఇదే సమయంలో.. పాక్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. సరిహద్దు వెంట ఉన్న హీరానగర్​ సెక్టార్​లోని బాబియా పోస్ట్ లక్ష్యంగా కాల్పులు జరిపింది. అయితే పాక్ కవ్వింపు చర్యలకు బీఎస్​ఎఫ్ దళాలు ప్రతిస్పందించలేదు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'

Last Updated : Jun 20, 2020, 12:12 PM IST

For All Latest Updates

TAGGED:

pak drone
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.