జమ్ములోని భారత్-పాక్ సరిహద్దులో ఓ చొరబాటుదారుణ్ని సరిహద్దు బలగాలు కాల్చి చంపాయి. సాంబా సెక్టార్లోని చాక్ ఫకీరా సరిహద్దు పోస్టు వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
"పదేపదే హెచ్చరించినా ఆ చొరబాటుదారుడు సరిహద్దు వైపు వచ్చాడు. బీఎస్ఎఫ్ బలగాలు అతడిపై కాల్పులు జరిపాయి. పాకిస్థానీ చొరబాటుదారుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి" అని వివరించారు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి. సరిహద్దుకు 40 మీటర్ల దూరాన.. భారత భూభాగంలో మృతదేహం పడి ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: 170 కాదు.. 203 మంది గల్లంతు:సీఎం రావత్