మిజోరాంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). సోమవారం రాత్రి సరిహద్దుల్లో జరిపిన సోదాల్లో ఈ భారీ డంప్‌ను బీఎస్ఎఫ్ 90వ బెటాలియన్ కనుగొంది. 31 ఏకే 47 రైఫిల్స్, 4500 రౌండ్స్ బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది.
![BSF 90 Bn recovered 31 AK rifles and 4500 rounds of ammunition found in Mizoram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8979652_694_8979652_1601364393318.png)
క్షేత్ర స్థాయి నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు బీఎస్ఎఫ్ ఈ సోదాలు నిర్వహించింది. మిజోరాంకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. సోదాల్లో భారీగా ఆయుధ సామగ్రితోపాటు రూ.39వేల నగదు లభ్యమైంది.
![BSF 90 Bn recovered 31 AK rifles and 4500 rounds of ammunition found in Mizoram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8979652_img.jpeg)