ETV Bharat / bharat

గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?

భక్తులు ఎక్కువగా ఆరాధించే దేవుడు విఘ్నేశ్వరుడు. వేడుక ఏదైనా తొలి పూజలు మాత్రం.. ఆది గణపయ్యకే. కళలకు, శాస్త్రాలకు అధిపతిగా.. బుద్ధిని, సిద్ధిని ప్రసాదించే దేవుడు గణనాథుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈయన స్వరూపం భారత్​లోనే కాకుండా విదేశాల్లోనూ కనిపిస్తుంది. అయితే గణేశుడి తలను గురించి వివరించే ఆ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడండి.

BRIEF HISTORY OF PATALAGUHA VINAYAKA TEMPLE
గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది? అది ఎక్కడ ఉంది?
author img

By

Published : Sep 3, 2020, 2:32 PM IST

గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది? అది ఎక్కడ ఉంది?

భక్తులకు బుద్ధి, సిద్ధిని ప్రసాదించే దేవుడు వినాయకుడు. ఏ వేడుకైనా, శుభకార్యమైనా తొలి పూజలు గణనాథుడికే. అందరు దేవుళ్లకు భిన్నంగా వినాయకుడు ఏనుగు తలతో ఉంటాడు. గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? అసలు తల ఎక్కడుంది? ఓ సారి పరిశీలిస్తే..

ఉత్తరాఖండ్​లోని పితోర్​గఢ్​ జిల్లా, గంగోలిహట్​లో.. మహాశివుడు ఆగ్రహంతో ఖండించిన వినాయకుడి అసలు శిరస్సు ఉంది. అక్కడి పాతాళ భువనేశ్వర గుహలో ఉన్నట్లు చెబుతారు. శిలారూపంలో ఉన్న విఘ్నేశ్వరుడి తలపై బ్రహ్మకమలం నుంచి తేనె పడుతూ ఉంటుందని స్థల పురాణం. అయితే వీటికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ.. ఈ గుహలో ఈశ్వరతత్వం ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. పార్వతీదేవిని చూసేందుకు అడ్డుకున్నాడన్న ఆగ్రహంతో మహా శివుడు ఖండించిన వినాయకుడి తల పాతాళ భువనేశ్వర గుహలో పడినట్లు స్థల పురాణం చెబుతోంది.

ఒకేసారి 4 పుణ్యక్షేత్రాల దర్శనం

నాలుగు పుణ్యక్షేత్రాలు చూడగలిగే అవకాశం కల్పించే ఏకైక ప్రాంతంగా పాతాళ భువనేశ్వర గుహ పేరొందింది. కేదార్​నాథ్​, బదరీనాథ్, అమర్​నాథ్​ క్షేత్రాలు ఈ గుహ నుంచి చూడవచ్చు. స్కంధ పురాణంలో పాతాళ భువనేశ్వర గుహ గురించిన ప్రస్తావన ఉంది. జగద్గురు శంకరాచార్య క్రీ.శ. 722లో ఈ గుహను సందర్శించారు. ఆ సమయంలో ధగధగా మెరిసి పోతున్న శివలింగాన్ని సామాన్యులు చూడలేరన్న కారణంతో లింగాన్ని రాగితో కప్పేశారు.

'విశ్వం పుట్టిందిక్కడే'

ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచే విశ్వం ఆది, అంతాలు చూడవచ్చని ఆలయ కమిటీ ఛైర్మన్​ నీలం భండారీ తెలిపారు. విశ్వం పుట్టుక ఇక్కడే జరిగిందని, కలియుగం ఎప్పుడు ముగుస్తుందో ఈ గుహ లోపల తెలిసినప్పుడు.. ఈ సృష్టి ఇక్కడే మొదలైందన్న విషయం అవగతమవుతుందని ఆయన వివరించారు.

మొఘలుల కాలంనాటి రచనల్లో..

ఇదొక పురాతన పుణ్యక్షేత్రమని, గంగోలీహట్​లో నెలకొన్న ఈ క్షేత్రం వివరాలు.. పురాణాల్లో, మొఘలుల కాలం నాటి రచనల్లో కనిపిస్తాయని యోగాంబర్​ భడావాల్​ అనే చరిత్ర కారుడు చెబుతున్నారు. లేడి వేటలో ఇక్కడకు వచ్చిన రాజా రీతుపర్ణకు శివ లింగం కనిపించిందని ఆయన అన్నారు. తర్వాత శంకరాచార్యుడు శివలింగాన్ని స్థాపించినట్లు కూడా నమ్మే ఈ దర్శనీయ, రమణీయ క్షేత్రంలో.. ఆశ్చర్యం కలిగించే అంశాలున్నాయని ఆ చరిత్రకారుడు పేర్కొన్నారు.

నాలుగు యుగాలను ప్రతిబింబిస్తూ..

నాలుగు యుగాలను ప్రతిబింబించే 4 శిలలు పాతాళ భువనేశ్వరగుహలో నెలకొని ఉన్నాయి. గుహలోపలికి ప్రవేశించగానే.. నరసింహ స్వామి దర్శనమిస్తాడు. కాస్త లోపలికి వెళ్తే.. శేష నాగుడి పడగ కనిపిస్తుంది. ఈ పడగపైనే భూమి నిలుస్తుందని నమ్ముతారు. మరింత ముందుకు వెళ్తే.. పరమ శివుడి జటాజూటం నుంచి గంగ ప్రవహిస్తున్నట్లు, కాలభైరవుడి నాలుక నుంచి లాలాజలం జాలువారినట్లుండే దృశ్యం కనిపిస్తుంది. ఐరావతం కూడా పాతాళ భువనేశ్వర గుహలో కనిపిస్తుంది. ఈ మార్గం గుండా వెళ్తే స్వర్గానికి చేరతారని నమ్ముతారు. 33 కోట్ల దేవతలు ఈ గుహలో నివాసముంటారని విశ్వాసం. ఇవన్నీ కళ్లారా చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.

ఇదీ చదవండి: ఉత్తరం రాస్తే కష్టాలు దూరం చేసే త్రినేత్ర గణేశుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.