పనసపండు.. వింటుంటూనే నోరూరుతోంది కదూ. ఓ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండ్లు.. ఇకపై ఏడాది పొడుగూతా మీకు దొరుకుతాయి. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా! మీరు వింటుంది నిజమే. కేరళ త్రిస్సూర్‌కు చెందిన ప్రముఖ రైతు వర్గీస్ తారకన్ స్వయంగా ఈ పనస రకాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరే 'ఆయుర్జాక్'.
బ్రెజిల్ రిపబ్లిక్ వేడుకలకు..
బ్రెజిల్ రిపబ్లిక్ డే వేడుకల కోసం దిల్లీలోని బ్రెజిలియన్ రాయబార కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. వచ్చే అతిథుల కోసం పనసపండు వంటకాలు రుచిచూపించాలని నిర్ణయించింది. ఆలోచన వచ్చిందే తడవుగా 64 కేజీల పనసపండ్లను కోరుతూ వర్గీస్‌కు లేఖ రాసింది.
క్షోనా మిత్ర..
కేరళ త్రిస్సూర్‌లోని కురుమల్ కున్నూలో వర్గీస్ తారకన్కు వ్యవసాయ క్షేత్రముంది. ఇక్కడే తారకన్ స్వయంగా 'ఆయుర్జాక్' పనసరకాన్ని అభివృద్ధి చేశారు. ఏడాది అంతా ఫలసాయాన్ని అందించే ఈ పనస కేరళ అంతటా ప్రసిద్ధిచెందింది.
వర్గీస్ తారకన్ కృషిని అభినందిస్తూ కేరళ ప్రభుత్వం 'క్షోనా మిత్ర' అవార్డును అందించింది. మరిన్ని అవార్డులు కూడా ఆయనను వరించాయి. ఐక్యరాజ్యసమితి అందించే వాఫా అవార్డుల జాబితాలో తారకన్ 'సాగు శైలి' కూడా ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి: పాక్ వక్రబుద్ధి.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు