ETV Bharat / bharat

మొబైల్ లాక్కున్నారని బాలుడి ఆత్మహత్య! - మొబైల్ వాడొద్దంన్నందుకు బాలుడు ఆత్మహత్య

పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులు వారించడం సహజమే. కానీ కొంతమంది పిల్లలు చిన్న విషయాలకే తమ ప్రాణాల్ని తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు చరవాణిని వాడొద్దని వారించినందుకు మహరాష్ట్ర ఠాణె జిల్లాలో ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Boy kills self after parents take away his mobile phone
మొబైల్ వాడొద్దనందుకు 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
author img

By

Published : May 30, 2020, 3:57 PM IST

మహారాష్ట్ర ఠాణె జిల్లా మిర్రా రోడ్డు ప్రాంతంలో విషాదకర ఘటన జరిగింది. తల్లిదండ్రులు మందలించారని ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ చరవాణిలో ఆటలు ఆడుతున్నాడని తల్లిదండ్రులు కోప్పడటం వల్లే ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది...

సదరు బాలుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పడు ఎక్కువగా మొబైల్​లో ఆటలు ఆడేవాడు. ఎంత మందలించిన తీరు మారకపోవటం వల్ల బాలుడి నుంచి చరవాణిని తీసుకున్నారు తల్లిదండ్రులు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఇంటిలోని ఫ్యాన్​కు ఉరి వేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:'మోదీ 2.0 పాలన హింసాత్మకం, నిరాశాజనకం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.