ETV Bharat / bharat

రాత్రంతా పబ్​జీ ఆడాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు - రాజస్థాన్​ కోటా

పబ్​జీ మైకంలో మరో ప్రాణం రాలిపోయింది. పబ్​జీ వ్యసనానికి గురైన ఓ 14 ఏళ్ల బాలుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రంతా పబ్​జీ ఆడి, శనివారం తెల్లవారుజామున నిద్రపోవడానికి వెళ్లిన అతడు.. ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని కోటాలో జరిగింది.

Boy kills self after a nightlong PUBG session: Police
'రాత్రంతా పబ్​జీ.. చివరికి బాలుడు ఆత్మహత్య'
author img

By

Published : Jun 6, 2020, 8:49 PM IST

రాజస్థాన్​ కోటాలో విషాదం చోటుచేసుకుంది. రాత్రంతా పబ్​జీ ఆడిన ఓ బాలుడు.. తెల్లవారుజామున తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కోటాలో నివసిస్తున్న 14ఏళ్ల బాలుడు.. రాత్రంతా పబ్​జీ ఆడి.. శనివారం తెల్లవారుజామున నిద్రపోవడానికి తన గదికి వెళ్లాడు. తన గది వెంటిలేటర్​కు ఉన్న గ్రిల్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.

ఆ 14ఏళ్ల బాలుడు ఓ ఆర్మీ అధికారి కొడుకు అని, 9వ తరగతి చదువుతున్నాడని రైల్వే కాలనీ పోలీస్​ స్టేషన్​ ఇన్​ఛార్జ్​ హన్స్​రాజ్​ మీనా వెల్లడించారు. మూడు రోజుల క్రితం బాలుడు తన తల్లి ఫోన్​లో పబ్​జీని ఇన్​స్టాల్​ చేసుకున్నట్టు వివరించారు. అప్పటి నుంచి రాత్రి పగలు పబ్​జీ ఆడుతూనే ఉన్నాడని పేర్కొన్నారు.

తన తమ్ముడు చదువుకుంటున్న గదిలో తెల్లవారుజామున 3గంటల వరకు పబ్​జీ ఆడి, అనంతరం నిద్రపోవడానికి తన గదికి వెళ్లాడు ఆ బాలుడు. ఉరి వేసుకున్న అతడిని చూసి దిగ్భ్రాంతి చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఎమ్​బీఎస్​ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు ప్రకటించారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని తరలించారు.

ఆ బాలుడు.. తల్లి, తమ్ముడుతో నివసిస్తున్నాడు. అతడి తండ్రి అరుణాచల్​ ప్రదేశ్​లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.