ETV Bharat / bharat

రైలు ఇంజిన్​ ఎక్కి సెల్ఫీ- నిండు ప్రాణం బలి - సెల్ఫీ సరదా

సెల్ఫీ తీసుకోవాలన్న ఆశ.. ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పటివరకు నాన్నతో కలిసి రైల్వే స్టేషన్​లో ఆడుకున్న ఆ చిన్నారి.. అంతలోనే విగతజీవి అయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Boy climbs train engine to take selfie, charred to death by Electric Shock
రైల్వే స్టేషన్​లో సెల్పీ.. నిండు ప్రాణం బలి
author img

By

Published : Nov 19, 2020, 4:22 PM IST

Updated : Nov 19, 2020, 5:05 PM IST

సెల్ఫీ సరదా.. ఓ బాలుడి ప్రాణాన్ని హరించేసింది. రైలు ఇంజిన్​ ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.

అసలేం జరిగింది?

తిరునెల్వెలి జిల్లా తలాయితులోని చర్చినగర్​కు చెందిన బాలుుడు జానేశ్వర్​. అతడు తన తండ్రితో కలిసి తిరునెల్వెలి రైల్వేస్టేషన్​కు చేరుకున్నాడు. అక్కడ సరదాగా ఆడుకున్నాడు. సెల్ఫీ తీసుకోవాలని రైలు ఇంజిన్​ ఎక్కాడు. ఈ క్రమంలో ఇంజిన్​పైన ఉన్న 40,000 ఓల్టుల ఓవర్​ హెడ్​ విద్యుత్​ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఇదీ చూడండి:50 అడుగుల బావిలో పడిన గజరాజు

Last Updated : Nov 19, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.