మహాత్ముడి సిద్ధాంతాలను సామాన్యుడికి చేరువ చేయడంలో వినోద రంగం గొప్పపాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. 2022లో దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్న నేపథ్యంలో 1857 నుంచి 1947 వరకు జరిగిన భారత స్వాతంత్ర్య సంగ్రామం, 1947 నుంచి సాగిన దేశ ప్రగతి ప్రస్థానానికి సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
శనివారం మోదీ తన నివాసంలో భారత వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని సినీ, టీవీ రంగాలు ఇటీవల రూపొందించిన నాలుగు సాంస్కృతిక వీడియోలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు ఆమీర్‌ఖాన్, షారుక్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, కంగనా రనౌత్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక నుంచి ఏటా.. అంతర్జాతీయ వినోద సదస్సు నిర్వహించాలనుకుంటున్నట్లు బాలీవుడ్ ప్రముఖులతో అన్నారు ప్రధాని.
ఈ కార్యక్రమం భాగంగా మాట్లాడిన బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్.. గాంధీ సిద్ధాంతాలు, వాటి ఆచరణలో ప్రధాని మోదీ కనబరుస్తున్న శ్రద్ధను కొనియాడారు.
-
#WATCH Shahrukh Khan speaks during Prime Minister Narendra Modi’s interaction with members of film fraternity on 'ways to mark the 150th birth anniversary of Mahatma Gandhi.' pic.twitter.com/GdA8VKWV9c
— ANI (@ANI) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Shahrukh Khan speaks during Prime Minister Narendra Modi’s interaction with members of film fraternity on 'ways to mark the 150th birth anniversary of Mahatma Gandhi.' pic.twitter.com/GdA8VKWV9c
— ANI (@ANI) October 19, 2019#WATCH Shahrukh Khan speaks during Prime Minister Narendra Modi’s interaction with members of film fraternity on 'ways to mark the 150th birth anniversary of Mahatma Gandhi.' pic.twitter.com/GdA8VKWV9c
— ANI (@ANI) October 19, 2019
" నిజం చెప్పాలంటే... నాకేమనిపిస్తుందంటే... నా తల్లిదండ్రులు, మన కుటుంబ పెద్దలు మనకి చాలా మంచి పద్ధతులు నేర్పించారు. చూసేందుకు అవి చిన్నచిన్నవిగానే ఉంటాయి. కొన్ని మర్చిపోతుంటాం కూడా. మీకో మంచి ఉదాహరణ చెబుతాను. అది మీరు ప్రారంభించిందే. మనం పరిశుభ్రంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న చెత్తా,చెదారాన్ని తీసి పారేయాలని మనందరికి తెలుసు. కానీ వాటిని మీరు స్వచ్ఛతా అభియాన్ ద్వారా తిరిగి పరిచయం చేశారు. అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. మేమందరం దాన్ని పాటించడం మొదలుపెట్టాం. మంచి ఆలోచన... అందరికీ తెలిసిందే కానీ మళ్లీ దాన్ని ప్రారంభించారు. నాకేమనిపిస్తుందంటే మనకి గాంధీజీ 2.0 కావాలేమో అనిపిస్తోంది. ప్రపంచం చాలా మారిపోయింది. పరుగెడుతోంది. మీరు డిజిటలైజేషన్ కూడా చేశారు. పేమెంట్ గేట్‌వేలను కూడా తెరిచారు. ఇప్పుడే మనమంతా ముందుకు రావాలి. మన పెద్దలు మనకు నేర్పించిన మంచి పద్ధతులు, చిన్న చిన్న అలవాట్లు... ఇప్పటి తరానికి, భవిష్యత్ తరానికి అర్థమమయ్యేలా చెప్పటానికి మనవంతు ప్రయత్నం చేయాలి."
- షారుక్ ఖాన్, సినీ నటుడు
ప్రధానితో సమావేశంపై బాలీవుడ్ ఖాన్ల ద్వయం షారుక్-ఆమీర్ ఇరువురు కలిసి ఓ వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రధాని ఆలోచనలు ఎంతో ప్రేరణ కలిగించేలా ఉన్నాయని దిగ్గజ నటులు కొనియాడారు.
షారుక్-ఆమీర్ వీడియో సందేశం..
-
It was a wonderful interaction, says @aamir_khan.
— PMO India (@PMOIndia) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A great way to involve everyone, says @iamsrk.
Two top film personalities talk about the meeting with PM @narendramodi.
Watch this one... pic.twitter.com/hzhJsKDqsG
">It was a wonderful interaction, says @aamir_khan.
— PMO India (@PMOIndia) October 19, 2019
A great way to involve everyone, says @iamsrk.
Two top film personalities talk about the meeting with PM @narendramodi.
Watch this one... pic.twitter.com/hzhJsKDqsGIt was a wonderful interaction, says @aamir_khan.
— PMO India (@PMOIndia) October 19, 2019
A great way to involve everyone, says @iamsrk.
Two top film personalities talk about the meeting with PM @narendramodi.
Watch this one... pic.twitter.com/hzhJsKDqsG
మోదీనే తొలి ప్రధాని..
-
It’s a remarkable day for us.
— PMO India (@PMOIndia) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
PM @narendramodi has given great respect to our industry.
Hear what Kangana Ranaut has to say... pic.twitter.com/Y0w6VvltV2
">It’s a remarkable day for us.
— PMO India (@PMOIndia) October 19, 2019
PM @narendramodi has given great respect to our industry.
Hear what Kangana Ranaut has to say... pic.twitter.com/Y0w6VvltV2It’s a remarkable day for us.
— PMO India (@PMOIndia) October 19, 2019
PM @narendramodi has given great respect to our industry.
Hear what Kangana Ranaut has to say... pic.twitter.com/Y0w6VvltV2
" నాకు తెలిసి కళలు, కళాకారులు, సినీ పరిశ్రమను కూడా పరిగణనలోకి తీసుకున్న తొలి ప్రభుత్వం ఇదే. తొలి ప్రధాని కూడా మోదీనే. ఇదివరకు ఎవరూ సినీ పరిశ్రమకు ఇంత గౌరవం ఇవ్వలేదు. సినీ పరిశ్రమకు ఉన్న సున్నితమైన శక్తిని ఇదివరకు గుర్తించలేదు. సినీ పరిశ్రమ తరపున హృదయపూర్వకంగా ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. గాంధీ సిద్ధాంతాల ప్రచారం, ఆయన జీవితం, విలువల గురించి ప్రధాని వివరించారు. మేము వాటిని నిర్దిష్టంగా పాటించేందుకు ప్రయత్నిస్తాం."
- కంగనా రనౌత్, సినీ నటి
అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి..
-
The Prime Minister was approachable and supportive of our efforts, says @Asli_Jacqueline.
— PMO India (@PMOIndia) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Listen to what she has to say... pic.twitter.com/vKmNI1hGDs
">The Prime Minister was approachable and supportive of our efforts, says @Asli_Jacqueline.
— PMO India (@PMOIndia) October 19, 2019
Listen to what she has to say... pic.twitter.com/vKmNI1hGDsThe Prime Minister was approachable and supportive of our efforts, says @Asli_Jacqueline.
— PMO India (@PMOIndia) October 19, 2019
Listen to what she has to say... pic.twitter.com/vKmNI1hGDs
" ప్రధాని మోదీ సమక్షంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ప్రధాని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. పరిశ్రమకు చేయూతనిస్తూ, మాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన సమక్షంలో ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను."
- జాక్విలైన్ ఫెర్నాండెజ్, సినీ నటి
అందరికీ ప్రోత్సాహం అందించారు..
-
The session was good and informal, says director Imtiaz Ali. He also highlights how this effort will add strength to popularising Gandhian thoughts. pic.twitter.com/B39UfOu0LE
— PMO India (@PMOIndia) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The session was good and informal, says director Imtiaz Ali. He also highlights how this effort will add strength to popularising Gandhian thoughts. pic.twitter.com/B39UfOu0LE
— PMO India (@PMOIndia) October 19, 2019The session was good and informal, says director Imtiaz Ali. He also highlights how this effort will add strength to popularising Gandhian thoughts. pic.twitter.com/B39UfOu0LE
— PMO India (@PMOIndia) October 19, 2019
" సమావేశం చాలా చక్కగా జరిగింది. ఎన్నో మంచి విషయాలపై చర్చించాం. సినీ పరిశ్రమలో ఉన్న మాకందరికీ మంచి ప్రోత్సాహం అందించారు. ప్రధాని చెప్పిన విధానం ఎంతో సరళంగా, అందంగా ఉంది. మా అందరికీ ఎంతో చక్కగా అర్థమైంది. గాంధీజీపై, ఆయన విధానాలపై సినిమాలు చేయాల్సిందిగా కోరారు. అలా చేయడం మాకెంతో ఉపయోగకరం. మమ్మల్ని మేం తిరిగి కొత్తగా ఆవిష్కరించుకునేందుకు బాగుంటుంది. మనమంతా గాంధీజీ గురించి మాట్లాడుకుంటాం. కానీ... ఆయన విధానాలపై పెద్దగా చర్చించం. గాంధీజీ గురించి, ఆయన ఆచరించిన విధానాల గురించి అందరికీ తెలిసేలా చెప్పేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను."
- ఇంతియాజ్అలీ, దర్శకుడు