హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో పురోగతి సాధించారు అధికారులు. 10 రోజుల అనంతరం ఒక సైనికుడి మృతదేహం దొరికింది. మరో నలుగురు జవాన్ల ఆచూకీ ఇంకా లభించలేదు.
ఫిబ్రవరి 20న కిన్నౌర్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఏడవ జమ్ముకశ్మీర్ రైఫేల్కు చెందిన ఆరుగురు సైనికులు మంచులో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన రోజే ఒకరి మృతదేహం దొరికింది.
గాలింపు చర్యల్లో 500 మంది
జవాన్ల కోసం సుమారు 500 మంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని కిన్నౌర్ జిల్లా ప్రజాసంబంధాల అధికారి మమత నేగి తెలిపారు.