ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చింది ముంబయి మహానగర పాలిక(బీఎంసీ). లాక్డౌన్ సమయంలో నిత్యావసరాల దుకాణాలు మినహా మద్యం షాపులు, ఇతర ఏ దుకాణాలు తెరవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలకు మార్పులు చేసింది.
అత్యవసర విభాగంలో ఉపయోగించే వైద్య పరికరాలు, కంప్యూటర్లు, వాహనాలు, ఇతర యంత్రాలు కొన్ని పనిచేయడం లేదని.. వాటిని రిపేర్ చేయించాల్సిన అవసరం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ తెలిపారు. తక్షణమే ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ దుకాణాలు తెరవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
దేశంలోనే కరోనా ప్రభావం ముంబయిలో తీవ్రంగా ఉంది. నగరంలో ఇప్పటి వరకు 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 410మందికి పైగా మృతి చెందారు.