ETV Bharat / bharat

ఉద్దీపనలతో నీలి విప్లవానికి కొత్త రెక్కలు

నీలి విప్లవం.. భారత గ్రామీణ వ్యవస్థ పురోగతిలో కీలక పాత్ర వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండో నీలి విప్లవం సాధనలో భాగంగా తాజాగా రూ.25 వేలకోట్లు మత్స్యపరిశ్రమకు కేటాయించింది. మూడు నుంచి అయిదేళ్లలో పరిశ్రమలోని వివిధ విభాగాల్లో ఈ పెట్టుబడులను వినియోగిస్తారు. ఇదే విజయవంతమైతే.. భవిష్యత్​లో చేపల ఎగుమతిలో భారత్​ గొప్ప పురోగతిని సాధిస్తుంది.

ఉద్దీపనలతో... నీలి విప్లవానికి కొత్త రెక్కలు
author img

By

Published : Sep 10, 2019, 5:41 PM IST

Updated : Sep 30, 2019, 3:43 AM IST

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో మత్స్య పరిశ్రమది కీలక పాత్ర. ప్రతి దశాబ్దానికీ ఈ పరిశ్రమ చెప్పుకోదగిన ప్రగతి చూపుతోంది. ప్రస్తుతం చేపల ఎగుమతుల్లో చైనాది ప్రథమ స్థానం. 2016-17లో రూ.37,870 కోట్లు, 2018-19లో రూ.45,000 కోట్ల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసి భారత్ రెండో స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో చేపల ఎగుమతుల పురోగతికి కావలసిన వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. పరిశ్రమకున్న ఈ సామర్థ్యాన్ని గ్రహించి కేంద్ర ప్రభుత్వం నీలి విప్లవం పునరుత్తేజానికి సమాయత్తమైంది. దీన్ని నీలి విప్లవం 2.0 గా వ్యవహరించవచ్చు.

రెండో నీలి విప్లవం సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.25 వేలకోట్లు మత్స్యపరిశ్రమకు కేటాయించింది. మూడు నుంచి అయిదేళ్లలో పరిశ్రమలోని వివిధ విభాగాల్లో ఈ పెట్టుబడులను వినియోగిస్తారు. నౌకాశ్రయాల్లో మౌలికవసతుల కల్పనకు, హేచరీలు, ఇతర ఆధునిక సదుపాయాల కల్పనకు, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, శీతలీకరణ గొలుసు (కోల్డ్ చైన్) సదుపాయాలకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి రజని సిఖ్రి సిబల్ వెల్లడించారు.

మౌలిక వసతులకు ప్రాధాన్యం

భారత్ లో ఏడో పంచవర్ష ప్రణాళిక కాలం (1985-90)లో కేంద్ర ప్రభుత్వం మొదటిసారి నీలి విప్లవాన్ని సాధించింది. చేపలు, ఇతర సముద్ర ఆహారోత్పత్తుల వినియోగం పెంచేందుకు ఎన్నో కొత్త విధానాలను అనుసరించింది. చేపల బ్రీడింగ్ మొదలుకుని మార్కెటింగ్ తదితర అంశాల్లో రైతులు వినూత్న పద్ధతులు పాటించేలా కృషి చేసింది. ఎగుమతులనూ ప్రోత్సహించింది. దాంతో మొదటి నీలి విప్లవం సాకారమైంది.

తాజాగా కేంద్రం నీలి విప్లవం ఛత్రం కింద పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టింది. పరిశ్రమ పురోగతికి 2015-16 నుంచి ఇప్పటివరకు రూ.1,491 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ కమిటీ మత్స్య పరిశ్రమకోసం మత్స్య, రొయ్యల మౌలిక వసతుల అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా మత్స్య పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు సమకూరుతాయి. 2020నాటికి ఆక్వా ఉత్పత్తులను 1.50 కోట్ల టన్నులకు, 2022-23నాటికి రెండు కోట్ల టన్నులకు పెంచడం ధ్యేయం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. 2030నాటికి దేశ ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను రూ,4,50,000 కోట్ల స్థాయికి పెంచాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇది ఇప్పటి ఎగుమతులకంటే పది రెట్లు ఎక్కువ.

మత్స్య పరిశ్రమ దేశవ్యాప్తంగా 1.40 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో మత్స్య పరిశ్రమ వాటా ఒక శాతం. 50 రకాలకు పైగా చేపలు, రొయ్యలు, పీతలు తదితరాలను భారత్ 75 దేశాలకు ఎగుమతి చేస్తోంది. చేపలు, చేపల ఉత్పత్తులు ఎగుమతుల్లో చెప్పుకోదగిన పరిమాణాన్ని సంతరించుకున్నాయి. ఏటా విదేశాలకు జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం, వ్యవసాయ-అనుబంధ శాఖల ఎగుమతుల్లో 20 శాతం వాటా కలిగి ఉన్నాయి. రొయ్యలు, రొయ్యపిల్లల ఎగుమతిలో ప్రపంచంలో భారత్​దే అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 8,129 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. జాలర్లు, ఆక్వా రైతులు 3,827 గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. చేపలను విక్రయించే 1,914 సంప్రదాయ కేంద్రాలు (విపణులు) ఉన్నాయి. ఈ రంగం భారత్ లో కొంత శాతం జనాభాకు ఆహార భద్రత కల్పిస్తూ వేగంగా పురోగమిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారత్ వాటా 6.3 శాతం. ఎగుమతుల్లో వృద్ధి రేటు ఏడు శాతం. సీబాస్, గ్రే ముల్లెట్, కాట్ల, రోహు తదితర రకాల చేపలు, ఆర్నమెంటల్ చేపలు, పీతలు, రొయ్యలు, ముత్యాలు (పెరల్ కల్చర్ ) ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. మంచినీటి చేపల సాగులో కట్ల, రోహు, మ్రిగల్ రకాలు ఉత్పత్తిలో 87 శాతం వాటాను ఆక్రమించాయి. భారత్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2017-18లో అమెరికాకు 32.76 శాతం, ఆగ్నేయాసియాకు 21.59 శాతం చొప్పున జరిగాయి. ఐరోపాకు 15.77 శాతం, జపాన్ కు 6.29 శాతం, మధ్యప్రాచ్యానికి 4.10 శాతం, చైనాకు 3.21 శాతం ఎగుమతయ్యాయి. బ్లాక్ టైగర్, వనామీ రొయ్య రకాలు అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి కావడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు 308 కోట్ల డాలర్లు (రూ.22 వేలకోట్లకు పైగా) సమకూరాయి. తక్కువ లోతున్న 39 లక్షల హెక్టార్ల సముద్రంలో 12 లక్షల హెక్టార్లు చేపల ఉత్పత్తికి అనుకూలం. ఇది కాకుండా, 20 లక్షలకు పైగా చ.కి.మీ.లలో ఎక్స్ క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజడ్) ఉంది. కేంద్రం ఫిష్ ఫార్మర్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీస్ (ఎఫ్ ఎఫ్ డీఏ) కు, 39 బ్రాకిష్ వాటర్ (ఉప్పునీటి) ఫిష్ ఫార్మర్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీస్; (బీఎఫ్ డీఏ)కి మద్దతిచ్చే వ్యవస్థను నెలకొల్పింది.

కొత్త రకాలపై దృష్టి

వివిధ రకాల మత్స్య ఉత్పత్తుల దిశగా దృష్టి సారించి, అభివృద్ధి వ్యూహాలను రూపొందించుకోవడం పరిశ్రమకు ఎంతో అవసరం. ఐరోపాలో ఆక్వాకల్చర్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ దేశాలు నూతన రకాల చేపల ఉత్పత్తిపై దృష్టి సారించి, పరిశ్రమను ముందుకు పరుగులెట్టించాయి. అంతర్జాతీయ విపణిలో గిరాకీ ఉన్న జాతులను ఉత్పత్తి చేయడంద్వారా రైతులు లాభాలు సాధించవచ్చు. ఎగుమతులు ఊపందుకునేందుకు ఈ పద్ధతి ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే కేంద్రప్రభుత్వం నీలి విప్లవం సాధించే క్రమంలో ఈ అంశానికీ ప్రాధాన్యం ఇస్తోంది. సముద్రోత్పత్తుల నాణ్యత బాగుండాలంటే మంచి సంస్థల నుంచి విత్తనాలను (చేప పిల్లలను) కొనుగోలు చేయడం కీలకం. ఆక్వా ఉత్పత్తుల నిల్వ, సరఫరాలకు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించాలి. ఉదాహరణకు శీతలీకరణ గొలుసు వ్యవస్థ (కోల్డ్ చైన్) నష్టాలను గణనీయంగా తగ్గిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం మెరుగైన, వేగవంతమైన రవాణాకు తోడ్పడుతుంది. సముద్రాల్లో చేపలు అధికంగా ఉండే ప్రాంతాలను, వాతావరణంలో మార్పులను బయోసెన్సార్లు, ఉపగ్రహ పరిజ్ఞానాల ద్వారా తెలుసుకుంటున్నాం. దాన్ని జాలర్లకు చేరవేసే వ్యవస్థ అవసరం.

నీలి విప్లవం పథక ప్రధానోద్దేశం సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను గణనీయంగా పెంచడమే. తద్వారా జాలర్లు, ఆక్వా రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యం. సముద్రంలో చేపలవేటతోపాటు, మంచినీటి చేపలసాగును బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందించింది. ఆక్వాకల్చర్ కు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నా, రైతులు 14 శాతం నీటివనరులనే వినియోగించుకుంటున్నారు. గతంలోనూ నీలి విప్లవాన్ని సాధించినా, కొన్ని లోపాలు నెలకొన్నాయి. ఈసారి పూర్తి స్థాయిలో నీటివనరుల వినియోగాన్ని కేంద్రం ఆకాంక్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణను పరిగణనలోకి తీసుకుంటూ సుస్థిరాభివృద్ధికి ప్రయత్నిస్తోంది. తద్వారా 9.40 లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించనుంది. నడి (లోతైన) సముద్రంలో చేపలవేటపై సంప్రదాయ జాలర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యకలాపాలకు రూ.12.55 కోట్లు కేటాయించింది. వ్యాపారుల దోపిడిని అడ్డుకుంటూ జాలర్లు, రైతుల ఉత్పత్తులకు భరోసా కల్పిస్తోంది. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ ఆథారిటీ (ఎమ్ పెడా) గ్రామాలవారీగా రైతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చేపల పట్టివేత(హార్వెస్టింగ్)కు ముందు, తరవాత ఎమ్ పెడా నాణ్యత పరీక్షలను నిర్వహిస్తుంది. ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో నేషనల్ రెసిడ్యూ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వెటర్నరీ ఔషధాలు, ఇతర అవశేషాలను నిరోధించే దిశగా అవగాహన కల్పిస్తుంది. 506 అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 23 వేలటన్నుల ఉత్పత్తులను ప్రాసెస్ చేయవచ్చు. ఇందులో 62 శాతం ఐరోపా సమాఖ్య అనుమతించినవే.

పరిశోధనలకు పెద్ద పీట

చేపల మార్కెట్ అనగానే చాలామందికి అపరిశుభ్ర వాతావరణం, యాంటీ బయోటిక్స్ స్టెరాయిడ్స్వి వినియోగించిన ఉత్పత్తులు నాసిరకం, కల్తీ ఆహారం వంటివి గుర్తు వస్తాయి. ఈ ధోరణులకు దూరంగా ప్రజలకు జాలర్లపై నమ్మకం కలిగేలా ప్రతి ఉత్పత్తినీ మంత్రిత్వ శాఖ స్వచ్ఛమైనది, పరిశుభ్రమైనది గా ధ్రువీకరించే వ్యవస్థ ఉన్నప్పుడే వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. నగరాల్లో శీతలీకరణ వాతావరణంలో అత్యాధునిక చేపల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తీరప్రాంతం వెంబడి చిన్న తరహా చేపల వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించాలి. ప్రపంచవ్యాప్తంగా చిన్న పరిశ్రమలు నిర్వహించే వ్యాపారమే మొత్తం మత్స్య వాణిజ్యంలో 90 శాతం ఉంటుంది. వారి వ్యాపారాలను మరింత అభివృద్ధి చేస్తే పరిశ్రమ ఊపందుకుంటుంది. కేంద్రం దేశీయ పరిశ్రమలో పరిశోధన-అభివృద్ధిపై పెద్దయెత్తున నిధులు వెచ్చించాలి. శాస్త్రవేత్తల నుంచి సాంప్రదాయేతర పద్ధతులపై ఆలోచనలను ఆహ్వానించాలి. పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన డేటాబేస్ ను, భౌగోళిక సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని, ప్రభుత్వం చిత్తశుద్ధితో నీలి విప్లవం పథకాన్ని అమలు చేస్తే, చేపల సాగును ప్రత్యామ్నాయ ఆదాయంగా భావించే చిన్న రైతుల నుంచి భారీయెత్తున ఎగుమతులు చేస్తున్న పారిశ్రామికవేత్తల వరకు అందరికీ లబ్ధి చేకూరుతుందనడంలో సందేహం లేదు.

--- వీబీఎస్ఎస్​ కోటేశ్వరరావు (రచయిత)

ఇదీ చూడండి: గూగుల్​కు చిక్కులు- 'గుత్తాధిపత్యం'పై 50 రాష్ట్రాల దర్యాప్తు

AP Video Delivery Log - 0900 GMT News
Tuesday, 10 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0853: China MOFA Briefing AP Clients Only 4229203
DAILY MOFA BRIEFING
AP-APTN-0831: UAE Aramco AP Clients Only 4229200
Aramco CEO on oil firm's IPO
AP-APTN-0802: UK Brexit Farmers AP Clients Only 4229197
UK farmers bemoan lack of clarity on Brexit
AP-APTN-0801: Madagascar Pope Departure Ap Clients Only/No Resale 4229196
Farewell ceremony for pope in Madagascar
AP-APTN-0754: China Climate AP Clients Only 4229193
Ex-UN Chief: Trump 'wrong' on climate change
AP-APTN-0728: Bahamas Family Survivors AP Clients only 4229144
Family searches for hope in Dorian destruction
AP-APTN-0727: US Trump Bahamas AP Clients Only 4229148
Trump on World Cup, Bahamas, NKorea, Turnberry
AP-APTN-0723: US Rodman NKorea AP Clients Only 4229192
Former NBA player Dennis Rodman on Trump and Kim
AP-APTN-0704: France Schumacher AP Clients Only 4229191
Reports: Michael Schumacher in Paris hospital
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 3:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.