ETV Bharat / bharat

ఘాజీపుర్​ సరిహద్దుకు పోటెత్తిన అన్నదాతలు

author img

By

Published : Jan 30, 2021, 2:42 PM IST

Updated : Jan 30, 2021, 2:51 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతోన్న నిరసనల్లో పాల్గొనేందుకు వేలమంది రైతులు ఘాజీపుర్​ సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా తరలివచ్చిన అన్నదాతలు దిల్లీ-మేరఠ్ ఎక్స్​ప్రెస్​ హైవేపై బస చేశారు.

BKU stays put at Ghazipur border, more supporters pouring in
గాజీపూర్​ సరిహద్దులకు పోటెత్తిన అన్నదాతలు

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ భారీ సంఖ్యలో రైతులు ఘాజీపుర్​ సరిహద్దుకు తరలివస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ సహా.. రాజస్థాన్​, హరియాణా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున దిల్లీ సరిహద్దులో రైతులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకుంటున్నారు.

భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ట్రాక్టర్​ ర్యాలీ తర్వాత కాస్త బలహీన పడినట్టు అనిపించినప్పటికీ నిరసనల్లో పాల్గొనేందుకు రైతులు భారీగా వచ్చిచేరుతున్నారు. వీరంతా దిల్లీ-మేరఠ్ ఎక్స్​ప్రెస్​ హైవేపై బస చేశారు. ముజఫర్​నగర్​లో శనివారం నిర్వహించిన 'రైతుల మహాపంచాయత్​' అనంతరం కర్షకులు దీక్షాస్థలికి పోటెత్తుతున్నారు.

" రైతు ఉద్యమం బలంగానే ఉంది. ఇది రాజకీయ ఆందోళన కాదు. శాంతియుత నిరసనలకు దేశవ్యాప్త మద్దతు లభిస్తోంది. నిరసనలకు సంఘీభావంగా అనేక మంది రైతులు తరలివస్తున్నారు."

- పవన్​ ఖత్నా, మీరట్​ బీకేయూ నేత

వారు అవసరం లేదు..

ఉద్యమాన్ని మధ్యలో వదిలి వెళ్లేవారు దయచేసి రావద్దని పవన్​ ఖత్నా విజ్ఞప్తి చేశారు. మాతో కలసి పనిచేయాలనుకునే వారికి.. పరస్పర భావజాలం ఉన్నవారికి స్వాగతం ఉంటుందన్నారు. చివరి వరకు ఉద్యమం కొనసాగడం ఇష్టంలేని వారు అవసరం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు శనివారం సాయంత్రం వరకు దాదాపు 5 వేలమంది రైతులు గాజీపుర్​ చేరుకుంటారని పోలీసులు అంచనా వేయగా.. సుమారు పదివేల మంది వస్తారని బీకేయూ నేతలు చెబుతున్నారు.

భారీ బందోస్తు..

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. స్థానిక పోలీసులతో పాటు, ర్యాపిడ్​ యాక్షన్​ ఫోర్స్, సాయుధ దళాలను నిరసనలు జరిగే ప్రాంతంలో మోహరించింది.

మరోవైపు దిల్లీ-మేరఠ్​ ఎక్స్​ప్రెస్​ హైవేపై రాకపోకలకు అనుమతి లేదని దిల్లీ పోలీసు విభాగం ప్రకటించింది.

ఇదీ చదవండి: దిల్లీ సరిహద్దులో రైతుల ఉపవాస దీక్ష

Last Updated : Jan 30, 2021, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.