బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థి అయిన సిన్హాకు 126 ఓట్లు రాగా.. మహాకూటమి తరఫున పోటీ చేసిన అవధ్ బిహారీ చౌదరీ(ఆర్జేడీ)కి 114 ఓట్లు వచ్చాయి.
శాసన మండలి సభ్యుడైన సీఎం నితీశ్ కుమార్ సభకు హాజరు కావడాన్ని నిరసిస్తూ.. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ జితన్ రాం మాంఝీ.. వాయిస్ ఓటుకు మొగ్గుచూపడం వల్ల వివాదం మరింత ముదిరింది. మాంఝీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. అయితే.. హెడ్‌కౌంట్ ఆధారంగా ఓటింగ్ ముగించారు ప్రొటెం స్పీకర్.
ఇదీ చదవండి: 'భర్తీ చేయలేని యోధుణ్ని కోల్పోయాం'