ETV Bharat / bharat

బంగాల్​లో భాజపా కార్యకర్త దారుణ హత్య

బంగాల్​ మరో రాజకీయ హత్యతో వేడెక్కింది. ఇంటిఇంటి ప్రచారం చేస్తోన్న కొంతమంది భాజపా కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు.

BJP worker beaten to death in Bengal
బంగాల్​లో భాజపా కార్యకర్త దారుణ హత్య
author img

By

Published : Dec 13, 2020, 5:40 AM IST

బంగాల్​లో ఉత్తర 24 పరగణాల జిల్లాలో దారుణం జరిగింది. ఇంటిఇంటి ప్రచారానికి వెళ్లిన భాజపా కార్యకర్తలపై మూకదాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఏం జరిగింది..?

హలిసహర్​ ప్రాంతంలో భాజపా కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా కొంతమంది దుండగులు వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు.

కార్యకర్త మరణంపై భాజపా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన గుండాలే ఈ హత్య చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు ఖండించారు.

2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇటీవల భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్యాయ్​పైనే కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేయడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.