కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే... ఉత్తరప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం అనివార్యం. ఇక్కడ ఎన్ని సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని మెరుగైన అవకాశాలు ఉంటాయి. 2014లో మోదీ ప్రభంజనంతో భాజపా యూపీలో 80 సీట్లకు గాను 71 కైవసం చేసుకుంది. మరో సీటు మిత్రపక్షానికి వచ్చింది.
ఈసారి ఎస్పీ, బీఎస్పీ నేతృత్వంలోని మహాకూటమితో గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేశారు. అత్యధిక మీడియా సంస్థలు మాత్రం భాజపా విజయం ఖాయమని చెబుతున్నాయి. ఒక్క సీ-ఓటర్ సర్వేలో మాత్రమే భాజపా కన్నా మహాకూటమి కాస్త ఆధిక్యంలో ఉంది.
టైమ్స్ నౌ
- భాజపా-58
- కాంగ్రెస్-2
- మహాకూటమి-20
సీ-ఓటర్
- భాజపా-38
- కాంగ్రెస్-2
- మహాకూటమి-40
ఎన్డిటీవీ
- భాజపా- 55
- కాంగ్రెస్-2
- మహాకూటమి-23
జన్ కీ బాత్
- భాజపా- 53
- కాంగ్రెస్-3
- మహాకూటమి-24
ఇదీ చూడండి: ఎన్డీఏ విజయం తథ్యం: ఎగ్జిట్ పోల్స్