ETV Bharat / bharat

వ్యవసాయ బిల్లులపై అవగాహనకు భాజపా ప్రచారాలు - వ్యవసాయ బిల్లుల నిరసనలు

వ్యవసాయ బిల్లులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించడానికి భాజపా నిర్ణయించింది. 7 రాష్ట్రాల్లో 15 రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్​లు, మీడియా సమావేశాలు, వెబినార్లు నిర్వహించాలని పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. రైతుల్లో విపక్షాలు తీసుకొచ్చిన భయాలను తొలగించి.. చారిత్రక బిల్లుల వల్ల కలిగే మంచిని వారికి వివరించాలని స్పష్టం చేసింది.

BJP to hold awareness campaign on Farm Bills
వ్యవసాయ బిల్లులపై అవగాహనకు భాజపా ప్రచారాల అస్త్రం
author img

By

Published : Sep 27, 2020, 5:02 AM IST

వ్యవసాయ బిల్లులపై చెలరేగిన వివాదానికి చెక్​ పెట్టేందుకు భాజపా భారీ స్థాయిలో సన్నద్ధమైంది. బిల్లులపై రైతుల్లో అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని... ప్రజల్లోకి వెళ్లి బిల్లుల్లోని విషయాలను వివరించాలని భాజపా సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు పార్టీ ఈ చర్యలు చేపట్టింది.

విస్తృతంగా ప్రచారాలు...

7 రాష్ట్రాల్లో 15రోజుల పాటు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది భాజపా. వీడియో కాన్ఫరెన్స్​, వెబినార్లు, సమావేశాల ద్వారా రైతులకు అవగాహన కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఇదీ చూడండి:- ఎన్డీఏతో అకాలీదళ్​ తెగదెంపులు-కూటమి నుంచి క్విట్​

ఇదే విషయంపై రాజస్థాన్​, జమ్ముకశ్మీర్​, పంజాబ్​, హరియాణా, ఛండీగఢ్​, హిమాచల్​ప్రదేశ్​, దిల్లీలోని రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఇంఛార్జ్​లకు ఇప్పటికే ఓ సర్కులర్​ అందించారు భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్​ సింగ్​. ప్రచార కార్యక్రమాలు నిర్వహించి.. రైతుల్లో విపక్షాలు తీసుకొచ్చిన భయాలను తొలగించాలని స్పష్టం చేశారు. చారిత్రక బిల్లులతో కలిగే సత్ఫలితాలను వివరించాలని పేర్కొన్నారు.

ఇంటింటికి వెళ్లి...

ప్రతి జిల్లాలో మీడియా సమావేశాలు నిర్వహించాలని.. ఇందుకు పాత్రికేయులను సంప్రదించాలని కార్యకర్తలకు పార్టీ ఆదేశాలిచ్చింది. కిసాన్​ మోర్చా సభ్యులతో పాటు ఇతర రైతు సంఘాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది.

ప్రచారాల్లో భాగంగా ప్రతి గ్రామంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి బిల్లులపై చర్చించే విధంగా ప్రణాళికలు రచించాలని సభ్యులకు సూచించి భాజపా. అవసరమైతే ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని పేర్కొంది.

వ్యవసాయ రంగంలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులకు పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం లభించింది. అయితే బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. కాంగ్రెస్​ సహా అనేక పార్టీలు అన్నదాతలకు మద్దతు ప్రకటించాయి.

ఇదీ చూడండి:- 'వ్యవసాయ బిల్లులతో బానిసలుగా రైతులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.