కర్ణాటకలో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఆ పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వాజూభాయ్ వాలా యడ్యూరప్పతో ప్రమాణం చేయించారు.
నేడు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.
ఇదీ జరిగింది..
ఈనెల 23న కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పతనమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించాలని గవర్నర్‌ను యడ్యూరప్ప ఈ రోజు ఉదయం కోరారు. అందుకు ఆయన సమ్మతించారు.
- ఇదీ చూడండి: యడ్డీ డైరీ: నాలుగోసారీ అదే ప్రత్యేకత..!