ETV Bharat / bharat

రాజ్యసభలో మరింత పెరగనున్న ఎన్​డీఏ బలం! - ఉత్తర్​ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు

ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్​లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలతో ఎన్​డీఏ తన బలాన్ని మరింత పెంచుకోనుంది. మొత్తం 11 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 10 స్థానాలు భాజపా గెలుచుకునే అవకాశం ఉంది. ఫలితంగా రాజ్యసభలో ఆ పార్టీకి 120 సభ్యుల మెజారిటీ రానుందని అంచనా.

BJP
ఎన్​డీఏ
author img

By

Published : Oct 15, 2020, 9:44 AM IST

ఎగువసభకు త్వరలో జరగబోయే ఎన్నికలతో తన బలాన్ని పెంచుకోనుంది ఎన్​డీఏ. ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో 11 స్థానాలకు జరగబోయే స్థానాల్లో భాజపా 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

రాజ్యసభలో ఖాళీ కానున్న 11 స్థానాల భర్తీకి నవంబరు 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ఈ నెల 20న వెలువడుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒకటి చొప్పున స్థానాలు ఖాళీ కానున్నాయి.

పదవీ విరమణ చేయనున్న సభ్యుల్లో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి (భాజపా), సినీ నటుడు రాజ్‌ బబ్బర్‌ (కాంగ్రెస్‌), పి.ఎల్‌.పునియా (కాంగ్రెస్‌) రామ్‌గోపాల్‌ యాదవ్‌ (ఎస్పీ) వంటివారు ఉన్నారు. వీరి పదవీకాలం వచ్చే నెల 25తో ముగుస్తుంది. ఈ స్థానాలకు 9న ఎన్నికలు నిర్వహించి అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.

యూపీలో భాజపాకే బలం..

11 స్థానాల్లో పదింటిని భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ దక్కించుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యూపీ శాసనసభలో 395 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 306 మంది భాజపా వారే. 9 మంది అప్నాదళ్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు భాజపా సర్కారుకు మద్దతు ఇస్తున్నారు.

రాజ్యసభకు ఒక అభ్యర్థి యూపీ అసెంబ్లీ నుంచి నెగ్గాలంటే 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ ప్రకారం భాజపా సునాయాసంగా 8 స్థానాలు గెలుచుకుంటుంది. కొద్దిమంది ఎమ్మెల్యేల మద్దతు సమీకరించగలిగితే 9వ స్థానం కూడా లభిస్తుంది.

ఈ పార్టీలకు నష్టం..

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి పదవీ విరమణ చేయనున్న 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారు. భాజపా, బీఎస్పీలకు చెరో రెండు స్థానాలు, కాంగ్రెస్‌కు ఒకటి చొప్పున ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఖాళీ అవుతున్న ఏకైక స్థానం కాంగ్రెస్‌ చేతిలో ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో ఈసారి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ బాగా నష్టపోనున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న భాజపా.. యూపీలో 8-9, ఉత్తరాఖండ్‌లో ఒకటి చొప్పున మొత్తంగా 9-10 స్థానాలను గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎగువ సభలో ఎన్డీఏ బలం 110 స్థానాలుగా ఉంది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యాక ఇది 119-120కి చేరనుంది. రాజ్యసభలో సభ్యుల సంఖ్య 245 కావడం వల్ల సభలో ఆధిక్యం (123) పొందడానికి మరో 3-4 సీట్ల దూరంలోనే అధికార కూటమి నిలుస్తుందని భావిస్తున్నారు. అయితే, అన్నాడీఎంకే (9), వైఎస్సార్​సీపీ (6) భాజపాకు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: భాజపా అభ్యర్థుల లెక్కలు తేలాయ్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.