దిల్లీ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను.. భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో... తొలి జాబితాను భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, మాజీ మేయర్లు రవీందర్ గుప్తా, యోగేందర్ చందోలియాతో పాటు ఆప్ మాజీ నేత కపిల్ మిశ్రాకు తొలి జాబితాలో స్థానం దక్కింది. ఈ జాబితాలో 11 మంది ఎస్సీలు, నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.
70 శాసనసభ స్థానాలున్న దిల్లీలో ఫిబ్రవరి 8న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: మోదీ భారత పౌరసత్వంపై ఆర్టీఐ దరఖాస్తు