చైనా నుంచి దిగుమతులు పెరగడంపై కేంద్రం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం మేక్ ఇన్ ఇండియా అని చెబుతోందని.. కానీ చైనా నుంచి వస్తువులను దిగుమతి చేస్తోందని దుయ్యబట్టారు.
"వాస్తవాలు అబద్ధమాడవు. భాజపా మేక్ ఇన్ ఇండియా అని చెబుతోంది. కానీ చైనా నుంచి దిగుమతి చేస్తోంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దీనికి ఆధారంగా చైనా నుంచి యూపీఏ హయాంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో దిగుమతి చేసుకున్న వస్తువులను పోలుస్తూ ఓ బార్గ్రాఫ్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాహుల్. ప్రస్తుత ఎన్డీఏ కాలంలో చైనా నుంచి దిగుమతులు పెరిగినట్లుగా ఈ చిత్రం చూపిస్తోంది.
తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయలో సరిహద్దు ఘర్షణ జరిగిన నాటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు రాహుల్. మేక్ ఇన్ ఇండియా ఓ విఫల కార్యక్రమమని విమర్శిస్తూ వస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆ వార్తలు అసత్యం- అమిత్ షా ట్వీట్ ఫేక్'