ETV Bharat / bharat

స్వీయ నిర్బంధంలో మరో భాజపా ఎంపీ

మరో భాజపా ఎంపీ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. ఇటీవలే సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన సురేశ్​ ప్రభు.. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండనున్నట్టు ప్రకటించారు. సురేశ్​ ఇప్పటికే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్లమెంట్​ సమావేశాలకు హాజరుకాలేనని రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.

BJP MP Suresh Prabhu has kept himself under isolation at his residence for the next 14 days,
కరోనా లేకపోయినా.. స్వీయ నిర్బంధంలో ఎంపీ
author img

By

Published : Mar 18, 2020, 10:12 AM IST

Updated : Mar 18, 2020, 11:36 AM IST

స్వీయ నిర్బంధంలో మరో భాజపా ఎంపీ

భారత్‌ తరపున జీ20 సదస్సు ప్రతినిధి, భాజపా ఎంపీ సురేశ్‌ ప్రభు స్వీయ నిర్బంధం విధించుకున్నట్లు తెలిపారు. దీంతో 14రోజుల పాటు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేనని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.

రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్‌ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు సురేశ్​ ప్రభు. ముందు జాగ్రత్తగా చేయించుకున్న పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గానే తేలింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఐసోలేషన్‌ సమయం ముగిసే వరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేనని తెలిపారు ప్రభు. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఛైర్మన్‌కు రాసిన లేఖలో వివరించారు.

ఇప్పటికే కేంద్రమంత్రి మురళీధరన్.. తన ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్నట్టు మంగళవారం ప్రకటించారు.

ఇదీ చూడండి:- కరోనా అనుమానితులకు నోరూరించే భోజనం.. మెనూ ఇదే!

Last Updated : Mar 18, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.