ETV Bharat / bharat

బిహార్​లో కమలనాథుల కల నెరవేరేనా? - తాజా వార్తలు బిహార్​ ఎన్నికలు

బిహార్​లో ఇప్పటివరకు మిత్రపక్షంగానే ఉన్న భాజపాకు తొలిసారి పట్టుబిగించే అవకాశం కనిపిస్తోంది. బిహార్​ అసెంబ్లీ కౌంటింగ్​లో ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థానాల్లో భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జేడీయూ కన్నా అత్యధిక స్థానాల్లో మెజారిటీని కనబరుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే నితీశ్​ కుమార్​ సీటుకే చేటు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

BJP
బిహార్​లో కమలనాథుల కల నెరవేరేనా!
author img

By

Published : Nov 10, 2020, 12:08 PM IST

బిహార్​ ఎన్నికల్లో ఎప్పుడూ ప్రధాన పోటీ జేడీయూ, ఆర్​జేడీ మధ్యే ఉంటుంది. అయితే ఈసారి అనూహ్యంగా భాజపా గట్టిపోటీ ఇస్తోంది. ఎన్​డీఏ కూటమిలో జేడీయూ కన్నా అత్యధిక స్థానాల్లో భాజపా అభ్యర్థలు ఆధిక్యంలో ఉన్నారు. ఆర్​జేడీ, భాజపా మధ్య హోరోహోరీ పోరు కొనసాగుతోంది.

BJP
భాజపా శ్రేణుల సంబరాలు
BJP
భాజపా శ్రేణుల సంబరాలు
BJP
భాజపా శ్రేణుల సంబరాలు

ఇదే కొనసాగితే...

ఇప్పుడున్న ట్రెండ్​ కొనసాగితే ఎన్​డీఏలో భాజపానే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొనే అవకాశం ఉంది. అదే జరిగితే భాజపా నేతలు సీఎం సీటుపై పట్టు పట్టే అవకాశం లేకపోలేదు. అయితే ఎన్నికలకు ముందు ఏది ఏమైనా ఎన్​డీఏ సీఎం అభ్యర్థి నితీశ్​ కుమార్​ అని భాజపా అగ్రనాయకులు పదేపదే చెప్పారు. మరి ఫలితాలు తేలేసరికి ఆ మాటపై నిలబడతారా? లేక బిహార్​లో ఇప్పటివరకు కలగా మిగిలిన సీఎం స్థానానికి పట్టుపడతారా? అనేది చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.