ETV Bharat / bharat

కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలపై దుమారం - MP CM, Scindia sit on fast against Nath's remark on minister

మధ్యప్రదేశ్​ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా.. భాజపా మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. తమ అభ్యర్థిపై కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలు చేశారని భాజపా నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కమల్​నాథ్​కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ రెండు గంటల పాటు దీక్ష చేపట్టారు. ద్రౌపదిని అగౌరపరచడం వల్ల మహాభారత యుద్ధం జరిగిందని... కమల్​నాథ్​ వ్యాఖ్యలను ప్రజలు సహించబోరని దుయ్యబట్టారు చౌహాన్​.

BJP leader requests Sonia Gandhi to dismiss Kamal Nath over his 'item' jibe
కమల్​నాథ్​ అణుచిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
author img

By

Published : Oct 19, 2020, 12:37 PM IST

మధ్యప్రదేశ్​ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్​ తరఫున ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్​నాథ్​.. భాజపా మహిళా అభ్యర్థి ఇమార్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం కుప్పకూలే సమయానికి ఇమార్తీ దేవి రాష్ట్ర కేబినెట్​ మంత్రిగా ఉన్నారు. అనంతరం భాజపా గూటికి చేరి తాజాగా ఉపఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దేవి కాంగ్రెస్​కు ద్రోహం చేశారని.. ఆమె వ్యవహారం తనకు ముందు తెలియదని పేర్కొన్నారు కమల్​నాథ్​. ఈ నేపథ్యంలోనే పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు​.

  • #WATCH: Our candidate is not like her... what's her name? (people shout Imarti Devi, who is former State Minister) You know her better and should have warned me earlier... ye kya item hai: Former Madhya Pradesh CM & Congress leader Kamal Nath pic.twitter.com/eW76f2z8gU

    — ANI (@ANI) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'అది నా తప్పా?'

కమల్​నాథ్​ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇమార్తీ దేవి. ఆయన్ను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్​ చేశారు.

"ఓ పేద ఎస్​సీ కుటుంబం నుంచి రావడం నేను చేసిన తప్పా? కమల్​నాథ్​ లాంటి వారిని కాంగ్రెస్​లో ఉండనీయరాదని నేను సోనియాను కోరుతున్నా. నా మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఎస్​సీ సంఘంలోని మహిళల పరిస్థితి ఏంటి? మహిళలు ముందడుగు ఎలా వేస్తారు?"

--- ఇమార్తీ దేవి, భాజపా నేత.

కమల్​నాథ్​ను ఇన్నేళ్లు సోదరుడిగా భావించానని... కానీ ఆయన తనను అగౌరపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఇమార్తీ దేవి. నిజానికి జ్యోతిరాదిత్య సింధియా వల్లే తాను కేబినెట్​ మంత్రి పదవి చేపట్టానని.. కమల్​నాథ్​ తనను చిన్నచూపు చూసేవారని ఆరోపించారు. కమల్​నాథ్​ వంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని భాజపాను కోరారు.

ఇదీ చూడండి:- ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు ఉద్యమించాలి: సోనియా

భాజపా ఆగ్రహం...

కమల్​నాథ్​ వ్యాఖ్యలపై భాజపా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర మహిళలను కమల్​నాథ్​ అగౌరపరుస్తున్నారని ఆరోపించింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

నిరసనలు...

BJP leader urges Sonia to dismiss Kamal Nath over his 'item' jibe
భాజపా మౌన వ్రతం

కమల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. భాజపా నేతలు నిరసన బాటపట్టారు. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్, ఇతర నేతలు రెండు గంటల పాటు 'మౌన వ్రతం' నిర్వహించారు. కాంగ్రెస్​కు దీర్ఘకాలం సేవ చేసిన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ద్రౌపదిని కించపరచడం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని గుర్తుచేశారు.

శివరాజ్​ సింగ్​ చౌహాన్​

"కమల్​నాథ్​జీ... ద్రౌపదిని అగౌరపరచడం వల్ల మహాభారత యుద్ధాన్ని చూసిన దేశమిది. ఆ యుద్ధంలో ఓ కుటుంబం నాశనమయ్యింది. మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలు సహించరు. ఇది సిగ్గుచేటు."

--- శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి.

మరోవైపు ఇండోర్​లోని రీగల్​ స్క్వేర్​ వద్ద.. భాజపా రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, లోక్​సభ సభ్యుడు శంకర్​ లాల్వాని మౌన దీక్ష చేపట్టారు.

మధ్యప్రదేశ్​లో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:- కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్- నెటిజన్ల ఫైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.